ఎనిమల్ కేర్ సెంటర్ కోసం స్థల పరిశీలన చేసిన మేయర్ సునిల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్.

Published: Monday April 25, 2022
*నగరంలోని పెరిగిన వీది కుక్కల బెడద సమస్యను త్వరలోనే పరిష్కరిస్తాం.
*మంత్రి గంగుల కమలాకర్ గారి సహాకారంతో కలెక్టర్ ఆర్ వి కర్ణన్ నగరపాలక సంస్థకు స్థలం కేటాయింపు.
*స్థలాన్ని పరిశీలించి... చదును చేసి ఎనిమల్ కేర్ సెంటర్ నిర్మాణంకు చర్యలు తీస్కోవాలని అధికారులకు ఆదేశాలు.
కరీంనగర్, ఏప్రిల్ 24 ప్రజాపాలన : ప్రజలు గత కొన్ని సంవత్సరాలుగా నగర వ్యాప్తంగా ఎదుర్కుంటున్న వీది కుక్కల బెడద సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని నగర మేయర్ యాదగిరి సునిల్ రావు అన్నారు. కౌన్సిల్ సమావేశంలో కుక్కల స్వైర విహారం పై పాలకవర్గ సభ్యులు తెలిపిన ప్రజల విజ్ఞప్తుల మేరకు కరీంనగర్ లో శనివారం రోజు నగర మేయర్ యాదగిరి సునిల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. నగరంలోని హౌజింగ్ బోర్డు మరియు బొమ్మకల్ శివారు ప్రాంతంలో మంత్రి గంగుల కమలాకర్ సహాకారంతో జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్ కేటాయించిన ప్రభుత్వ భూమిని తనిఖీ చేసి పరిశీలించారు. కేటాయించి భూమీలో ఉన్న ముడ్ల పొదల చెట్లను తొలగించి చదును కార్యక్రమాలు చేపట్టాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ మరియు వెటర్నరి అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ ద్వారా నూతన ఎనిమల్ కేర్ సెంటర్ నిర్మాణం చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నగర మేయర్ యాదగిరి సునిల్ రావు మాట్లాడుతూ... నగర వ్యాప్తంగా పెరుగుతున్న వీది కుక్కల బెడదతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్టా... సమస్య నుండి ప్రజలకు విముక్తి కలిగించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. బీసి సంక్షేమ మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహాకారంతో జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్ దృష్ఠికి తీసుకెల్లి కుక్కల బెడద సమస్య కోసం గతంలోనే స్థలంం కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. కౌన్సిల్ సమావేశ వేదిక ద్వారా పాలకవర్గ సభ్యుల నుండి కుక్కల స్వైర వీహారంపై చాలా విజ్ఞప్తులు వచ్చాయన్నారు. ప్రజల నుండి పాలకవర్గ సభ్యులకు మరియు నగరపాలక సంస్థకు వస్తున్న ఫిర్యాదుల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. కుక్కల స్వైర విహారం పట్ల ప్రజలను త్వరలోనే విముక్తి చేస్తామని హామి ఇచ్చారు. ఇందులో భాగంగానే నగరపాలక సంస్థ ఒక ఎనిమల్ కేర్ సెంటర్ నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. కేర్ సెంటర్ నిర్మాణం చేసేందుకు కలెక్టర్ హౌజింగ్ బోర్డు శివారు ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమీలో ఒక ఎకరం స్థలాన్ని కేటాయించారని... ఆ స్థలాన్ని అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. ఎనిమల్ కేర్ సెంటర్ నిర్మాణం కోసం కావల్సిన ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న స్థలంలో ముడ్ల పొదలను తొలగించి చదును చేసి... ప్రొటెక్ట్ చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. నగరంలో ఉన్న కుక్కలను చంపడం చట్ట రిత్యా నేరం కాబట్టి... జంతువులను రక్షించుకోవడం ప్రభుత్వాల బాధ్యత కాబట్టి ఎనిమల్ రైట్స్ చట్టం ప్రకారం కుక్కలను చంపె అధికారం ఎవరికి లేదన్నారు. ప్రభుత్వాల చట్టాల ప్రకారమే ఎనిమల్ కేర్ సెంటర్ నిర్మాణం చేసి... నగర వ్యాప్తంగా వీదుల్లో ఉన్న కుక్కలను పట్టి కేర్ సెంటర్ కు తరలిస్తామన్నారు. వాటి సంతతి పెరగకుండ వెటర్నరి డాక్టర్ల సహాకారంతో ఎనిమల్ కేర్ సెంటర్ లో కుక్కలకు బర్థ్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తామన్నారు. అంతే కాకుండ ప్రతి కుక్కకు ఆంటీ రేబిస్ వ్యాక్సినేషన్ కూడ చేయడం జరుగుతుందని తెలిపారు. నగరంలో వింత చేష్టలతో రేబిస్ లక్షణాలతో ప్రజలను ఇబ్బంది పెట్టే కుక్కలను మాత్రం ఎనిమల్ కేర్ సెంటర్ లోనే ఉంచి వ్యాక్సిన్ వేసి... వాటికి ప్రత్యేక రక్షణ కల్పించి... అక్కడే సంరక్షణ చేపట్టేలా చర్యలు తీస్కుంటామని తెలిపారు. కేటాయించిన ఎకరం స్థలంలో కేర్ సెంటర్ నిర్మాణం కోసం కావల్సిన సదుపాయలన్ని కల్పించుకొని కుక్కల బెడద నుండి ప్రజలకు రక్షణ కల్పిస్తామన్నారు. మొన్న జరిగిన పాలకవర్గ కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గ సభ్యుల సమక్షంలో వీది కుక్కల సమస్య పై చర్చించి పరిష్కారం కోసం కావల్సిన నిధులను కూడ నగరపాలక సంస్థ ద్వారా కేటాయించుకున్నామన్నారు. ఎనిమల్ కేర్ సెంటర్ నిర్మాణం కోసం త్వరలోనే ప్రణాళికలు సిద్దం చేసి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణం పనులు ప్రారంభిస్తామన్నారు. ఆరు మాసాల్లో కేర్ సెంటర్ నిర్మాణం చేసి... నగర వీదుల్లో అన్ని కుక్కల నుండి ప్రజలకు రక్షణ కల్పిస్తామన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ ప్రజల సంరక్షణ చేయడంతో పాటు వారికి కావాల్సిన వసతి సౌకర్యాలను కూడ కల్పించడమే ద్యేయంగా పనిచేస్తుందన్నారు. కుక్కల బెడద విషయంలో నగర ప్రజలు కూడ నగరపాలక సంస్థకు సహాకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూప రాణీ హారిశంకర్, కార్పోరేటర్ కోల మాలతి సంపత్, ఏస్ ఈ నాగమల్లేశ్వర్, ఈఈ కిష్టప్ప, డీఈ ఓం ప్రకాష్, వెటర్నరి డాక్టర్ సల్వాజీ శ్రీధర్, ఏఈ వాణీ తదితరులు పాల్గొన్నారు.