సింగరేణి బ్లాకులను ప్రైవేటుకివ్వద్దు

Published: Wednesday February 09, 2022
కరపత్రాలను పంపిణీ చేసిన టీబీజీకేఎస్
బెల్లంపల్లి, ఫిబ్రవరి 8, ప్రజాపాలన ప్రతినిధి: తెలంగాణలోని సింగరేణి కి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను వేలంపాటలో ప్రైవేటు వారికి అప్పగించే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవాలని టీబీజీకేఎస్ బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మంగళవారం నాడు మంచిర్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను రెండవ రోజు సింగరేణి ఉద్యోగులకు, ఏజెంట్ ఆఫీస్, వృత్తి శిక్షణ కేంద్రాలలో,  పంపిణీ చేశారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు వారికి గనులు కేటాయించడం వలన రానున్న రోజుల్లో సింగరేణి సంస్థ కనుమరుగయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు, ఈ కార్యక్రమంలో పిట్ కార్యదర్శి మెరుగు రమేష్, ఏరియా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, సమ్మయ్య, ఆలవేనా సంపత్, సదానందం, మురళీకృష్ణ, కిషన్, వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.