కేసిఆర్, సండ్ర చిత్రపటాలకు పాలాభిషేకం

Published: Friday February 17, 2023

తల్లాడ, ఫిబ్రవరి 16 (ప్రజా పాలన న్యూస్): తల్లాడ మండలం పాతపినపాక గ్రామం లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎస్సీ కమ్యూనిటీ హల్ 25లక్షలు, బీసీ భవన్ 25లక్షలు, సీసీ రోడ్లుకు నిధులు మంజూరు చేసిన సందర్బంగా, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తు పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో, సీఎం కెసిఆర్, సత్తుపల్లి ఎమ్మెల్యే  సండ్ర వెంకటవీరయ్య చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ తెల్లపుట్ట స్వరాజ్యం,ఉప సర్పంచ్ వజ్రాల రామిరెడ్డి,సొసైటీ డైరెక్టర్ కాంపాటి జమలయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు తాళ్లూరి నర్సింహా,ఉపాద్యక్షులు ఎక్కిరాల ఆధారo, ఎక్కిరాల భూషణం, తాళ్లూరి శ్రీను, యాలద్రి, ముత్తయ్య, వెంకటి,గ్రామ యూత్ అధ్యక్షులు శశి కుమార్, రమేష్ ,ఎక్కిరాల వేణు పాల్గొన్నారు.