ఎరుకల కులస్తుల పై అక్రమంగా కేసులు బనాయిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలి

Published: Friday June 04, 2021
- తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం
అమీర్ పేట్, జూన్ 3, (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రంలో ఎరుకల కులస్తుల పై అక్రమంగా కేసులు బనాయించి తీవ్ర చిత్రహింసలకు గురి చేస్తున్న ఖానాపూర్ సిఐ, మున్సిపల్ కమిషనర్ లపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సోమాజిగూడ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కుతాడి కుమార్, లోకిని రాజులు మాట్లాడుతూ... నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండలంలో దాదాపు 40 కుటుంబాలు పందుల పెంపకంతో జీవనోపాధిని గడుస్తున్నాయి అని అన్నారు. కాగా కొంతమంది మధ్యవర్తి దళారులతో ఖానాపూర్ సి ఐ(శ్రీధర్ గౌడ్), మున్సిపల్ కమిషనర్ లు చేతులు కలిపి గత నెల 28న 11 మంది ఎరుకల కులస్థూల మీద అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. ఎరుకల కులస్తులకు ముఖ్య ఉపాధి పందుల పెంపకం, అయిన రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రాంతాల నుంచి పందులను పట్టే వాళ్ళని రప్పించి ఎరుకలకు జీవనోపాధి లేకుండా చేస్తుందని అన్నారు. తద్వారా మా కులస్తులు జీవనోపాధి లేకుండా అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకొని ఎరుకలి కులస్తులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఖానాపూర్ సిఐ, మున్సిపల్ కమిషనర్లపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు చేసి వారి పై చట్ట పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ యువత కన్వీనర్ రాధాకృష్ణ, నిర్మల్ జిల్లా అధ్యక్షులు బాలయ్య, నాయకులు రాజేశ్వర్, చిన్నపోయా, తదితరులు పాల్గొన్నారు.