పొడి దుక్కిలో వరి విత్తే విధానం పై రైతులకు అవగాహన సదస్సు

Published: Saturday June 26, 2021
మల్లాపూర్ వ్యవసాయ అధికారి లావణ్య
మల్లాపూర్, జూన్ 25 (ప్రజాపాలన ప్రతినిధి) : మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట్ రైతు వేదికలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో నేరుగా పొడి దుక్కిలో వరి విత్తే విధానం పై రైతులకు అవగాహన సదస్సును వ్యవసాయ అధికారి లావణ్య నిర్వహించడం జరిగింది. వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రాష్ట్రంలో అవసరానికంటే ఎక్కువ నీరు వరిసాగులో వాడడం వల్ల భూములు తమ పోషకత్వాన్ని సహజ స్వరూపాన్ని కోల్పోయి ఖర్చులు పెరిగి దిగుబడి తగ్గి వరిసాగుకు గిట్టుబాటు కాకుండా పోతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని ఆదా చేసి ఎక్కువ దిగుబడి తక్కువ నీటితో సాధించడం అత్యవసరం. వరిని మనం సాధారణంగా పండించే మొక్కజొన్న నువ్వులు, సోయా, చిక్కుడు, వంటి పంటల మాదిరి ఆరుతడి పరిస్థితుల్లో పండించవచ్చు అని అన్నారు. రైతులకు వరి సాగు పై సందేహాలు తిరుస్తూ పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వంతడుపుల నాగరాజు, ఎంపిటిసి ఓస సత్తెమ్మ, ఉప సర్పంచ్ సామ రవి, వ్యవసాయ విస్తరణ అధికారులు రాధా, వంశీ, గజానంద్, ఆత్మ, ఏటీఎం నవిత, రైతులు రాజా రెడ్డి, దేవేందర్ రెడ్డి, శ్రీనివాస్,  మహిపాల్ రెడ్డి, వెంకటేశ్వర్లు, శేఖర్, జలంధర్, గణేష్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.