పేద ప్రజల కోసం నిరంతరం తపనబడ్డ నాయకుడు వైయస్సార్

Published: Thursday October 20, 2022
బోనకల్, అక్టోబర్ 19 ప్రజా పాలన ప్రతినిధి: దేశములోని ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసిన మహానాయకుడు ఆనాటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైయస్సార్ టిపి మండల నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజశేఖర్ రెడ్డి పార్టీ చూడలే,మనిషిని చూడలే, ప్రతి ఒక్కరికి నేనున్నానని భరోసా కనిపించిన నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి వారు పేర్కొన్నారు. ఇప్పటి రాజకీయ నాయకులు సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందించాలంటే నీది ఏ పార్టీ నీకు ఎలా వస్తుంది అని చూస్తున్నారు. కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రం ప్రజల పట్ల, పేద ప్రజల కోసం నిరంతరం తపన పడ్డ నాయకుడు అని, వారి క్షేమం కోసం పాలన చేసిన నాయకుడని, రైతుల రుణమాఫీ చేసి 64 లక్షల మందిని రుణ విముక్తులను చేశారని, బడి పిల్లలకు ప్లీజ్ రియంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీతో ఉచిత వైద్యం విద్య అందించారని,భూమిలేని నిరుపేదలకు ఆరు లక్షల ఎకరాలను పంచిపెట్టారని, 40 లక్షల మందికి పక్కా ఇల్లు కట్టించి స్థిర నివాసం ఏర్పాటు చేశారు. 77 లక్షల మంది కి పెన్షన్ ఇచ్చి బరోసాగా నిలిచారు. ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకువచ్చిన ఘనత వైయస్సార్ దేనని ఐదేళ్ల పాలనలో లక్ష మందికి ప్రభుత్వ ఉద్యోగాలు 11 లక్షల మందికి ప్రవేటు ఉద్యోగాలు కల్పించారు. బిసి ఎస్సి, ఎస్టీ వారి కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించారని, పేద ప్రజల స్వయం ఉపాధికి తోడ్పాటు అందించారని, మూడు లక్షల మంది ఆదివాసి బిడ్డలకు పోడు భూములు పట్టాలు అందజేశారు. అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిలమ్మ తండ్రి బాటలోనే అడుగులు వేస్తూ ప్రజలకు నేను నేనున్నానని భరోసా కనిపిస్తూ అడుగులు వేస్తూ నా తండ్రి చేసిన ప్రతి పని అంతకు అంతకు రెట్టింపుగా పేద ప్రజలకు అందజేస్తానని, రైతులను , బడుగు బలహీన వర్గాలను, నిరుద్యోగులను నేనున్నానని భరోసా తో ముందుకు నడుస్తున్న ప్రజాప్రస్థాన పాదయాత్ర ప్రతి పేదవారి కష్టసుఖాలు తెలుసుకోవాలని షర్మిలమ్మ చేస్తున్న పాదయాత్ర అని, కేసీఆర్ దళిత బంధువు అని పెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని, ఈ దళిత బంధు ఏర్పాటు చేసి ప్రతి పేదవాడికి అర్హుడైన ప్రతి ఒక్కరికి ఈ మండలంలో దళిత బంధు అందించాలని వైయస్సార్ తెలంగాణ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ ఈ కార్యక్రమంలో బోనకల్ వైయస్సార్ టిపి మండల అధ్యక్షుడు ఇరుగు జానేషు, అధికార ప్రతినిధి మర్రి ప్రేమ్ కుమార్, మండల ఉపాధ్యక్షుడు సైదా బాబు, ముష్టికుంట గ్రామ అధ్యక్షుడు ఎస్.కె మౌలాలి ,యూత్ మండల అధ్యక్షుడు మందా నాగరాజ్ ,తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area