మళ్లీ రోడ్డున పడనున్న ప్రైవేటు ఉపాధ్యాయులు

Published: Thursday March 25, 2021
మధిర, మార్చి 25, ప్రజాపాలన ప్రతినిధి : మడుపల్లి లక్ష్మణ్ AISF ఖమ్మం జిల్లా అధ్యక్షులు ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ గత 9 నెలలుగా పాఠశాలలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయివేటు ఉపాద్యాయులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తమ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రయివేటు టీచర్ల ఓట్ల కోసం తమ అవసరాల దృష్ట్యా పాఠశాలలు ప్రారంభం అనే తీపి కబురుతో  ఆశ పెట్టి. ఈ నెల 27 నుండి డిగ్రీ విద్యార్థులకు పరీక్షలు ఉండగా హాస్టల్లో ఉండి చదువుకునే విద్యార్థులు హాస్టల్ బంద్ అని అర్ధాంతరంగా హాస్టల్ ఖాళీ చేస్తున్నారని విద్యార్థుల పరిస్థితి ఏంటనితీరా ఎన్నికలు అయిపోయిన తరువాత మళ్ళీ ప్రైవేటు ఉపాధ్యాయులను రోడ్ల మీదకు ఈడుస్తున్నారు. అసలు రాష్ట్ర ప్రభుత్వ సమావేశాలకు, ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశాలకు, టిఆర్ఎస్ పార్టీలో చేరికలకు, అధికారపార్టీ ప్రచారాలకు అన్ని విధాలుగా రాని కరోనా కేసులు కేవలం పాఠశాలలో చదివే విద్యార్థులకు మాత్రమే రావడం ఏంటో ఆ పరమాత్మునికే తెలియాలి. ఏది ఏమైనా ప్రైవేట్ ఉపాధ్యాయుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటో మరోసారి నిరూపితమైంది