క్రైస్తవులకు క్రిస్మస్ పర్వదినం కంటే ముందే సెమీ కిర్స్మస్ వేడుకలు

Published: Tuesday December 07, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 6 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం వైష్ణవి గార్డెన్స్ ఏర్పాటుచేసిన సెమీ క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ కంటాట దృశ్యరూపం ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా ప్రదర్శించడం జరిగింది. క్రీస్తు బోధించిన ప్రేమతత్వం పలువురు పెద్దలు మార్గదర్శనం చేశారు. అదేవిధంగా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజా ప్రతినిధులు ఏసుక్రీస్తు బోధనలను సవివరంగా అర్థమయ్యే రీతిలో అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు కాంగ్రెస్ పార్టీ దండెం రాంరెడ్డి, బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు చెరుకూరి రాజు, మున్సిపల్ చైర్మన్ కపరి స్రవంతి చందు, వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి, మున్సిపల్ ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాల్, 12వ వార్డు కౌన్సిలర్ ఆకుల మమత ఆనంద్, రాజు, జెరూసలేం మత్తయ్య, తెలంగాణ రీజినల్ డైరెక్టర్ పాస్టర్ రిచర్డ్ హజరయ్యారు. ఆదివారం  ఇబ్రహీంపట్నం వైష్ణవి గార్డెన్స్ లో ఫాస్టర్స్ అసోసియేషన్, ఆధ్వర్యంలో అంగరంగ వైభోగంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. క్రిస్టియన్ ధర్మ పరిరక్షణ రాష్ట్ర కన్వీనర్ చెరుకూరి రాజు, పాల్ సమేల్, చార్లెస్ అశోక్, ప్రభాకర్, డేరంగుల మహేష్, యేసు రత్నం సైదులు వివిధ పాస్టర్లు పాల్గొని  యేసుక్రీస్తు జీవిత చరిత్రను కిస్మస్ -కంటాట దృశ్య రూపకాన్ని  సుమారు 70 మందితో కళ్లకుకట్టినట్లు వేదిక పై చూపించారు. వేడుకలకు పలువురు క్రీస్తు మతపెద్దలు, ఫాదర్ లు, హాజరై యేసు క్రీస్తు చరిత్ర ను తమదైన శైలిలో వివరించారు. ఏసుక్రీస్తు చూపిన మార్గంలో ప్రతిఒక్కరు పయనించాలని, ప్రతి ఒక్కరిని యేసు సక్రమమైన మార్గంలో నడిపిస్తూ అందరిని చల్లగా చూడాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1200 వందలమంది క్రిస్టియన్ సోదరులు హాజరయ్యారు. పలువురు పాస్టర్లు, క్రైస్తవ సోదరులు తదితరులు పాల్గొన్నారు.