బడంగ్ పేట్ లో చౌక ధర దుకాణాల దగ్గర రేషన్ దొరకడం లేదు

Published: Friday June 18, 2021
బాలపూర్, జూన్ 17, ప్రజాపాలన ప్రతినిది : చౌకధర దుకాణాల దగ్గర ప్రజలు బాధలు ఎవరికి చెప్పుకున్న తీరడం లేదుని ఆవేదన వ్యక్తపరిచారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ కార్పొరేషన్ లో చౌక ధర దుకాణం (17) షాపు 3 రోజులు బంద్ (13నుండి,15/6/2021 తేదీలలో)ఉండడంవల్ల ప్రజలకు అనుకోకుండా సమాచారం లేకపోవడం వల్ల చుట్టుపక్కల ప్రాంతాల కాలని వాసులందరూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఎదురు చూసి నిరాశతో ఇండ్లకు  వెళ్ళిపోయారని ప్రజలందరూ అంటున్నారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు  రేషన్ కార్డు లో ఉన్న ఒక్కొక్కరి పైన 15 కిలోలు బియ్యం తీసుకోవాలని తపన పడుతున్న ప్రజలు. కానీ షాపు యజమానులు తెలిసిన వారికి టోక్ నులు ఇచ్చి తెలియని వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. కరోనా లాక్డౌన్ ప్రభావం భాగంగా ప్రభుత్వం ఇచ్చిన రేషన్ తీసుకోవడానికి ఒకరోజు, రెండో రోజు తప్పించిన కూడా రేషన్ బియ్యం తీసుకోవడం తీరడం లేదని ఆవేదనతో కార్పొరేటర్ అమితా ప్రభు అంటున్నారు. ప్రభుత్వం మాదేనీ ప్రజాప్రతినిధుల సపోర్ట్ ఉన్నదిని చౌకధర దుకాణం షాపు యజమాని ఎవరికైనా చెప్పుకో... ఏమైనా చేసుకో.... ప్రజలతో అసహనంగా మాట్లాడుతున్నారని ఇది సమంజసం కాదని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భౌతిక దూరం పాటించకుండా ఎవరి బాధ వారు వెళ్లబోసుకున్నారు. వీరి బాధ  పట్టించుకుంటలేరు. లాక్ డౌన్ లో భాగంగా ప్రభుత్వం ఇచ్చిన రేషన్ బియ్యంతో జీవనం గడపాలి అనుకున్నా ప్రతి నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల బాధలు ఎవరికి చెప్పుకున్న తీరడం లేదని ఆవేదనతో బాద పడుతున్నారని చెప్పారు. స్థానికంగా కార్పొరేషన్ అధికారులు, ప్రజా ప్రతినిధులు షాపు యజమానులు చెప్పిన మాటలు నమ్మకముతో చూసి చూడనట్టు వెళ్లిపోతున్నారని ఆవేదన చెందుతున్న ప్రతి వ్యక్తి అంటున్నారు.