పేద ప్రజలకు ఉచితంగా నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం

Published: Wednesday May 26, 2021
మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు 
మేడిపల్లి, మే25 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి రెండవ దశలో విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డాన్ సందర్భంగా పేద ప్రజలు, రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న తరుణంలో రామంతాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు మానవత్వంతో ఇంటింటా ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పూనమ్ భవన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు మాట్లాడుతూ రామంతాపూర్ డివిజన్లో ఆర్థికంగా వెనుకబడిన పేద ప్రజలకు, దినసరి కూలీలు, ఆటోడ్రైవర్లకు, కరోనా సోకి హోమ్ ఐసోలేషన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి ఉచితంగా నిత్యావసర సరుకుల కిట్టును పంపిణీ చేస్తామని తెలిపారు. అలాగే కరోనా సోకి హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి ఉచితంగా హోమ్ డెలివరీ చేస్తామని అర్హులైన వారు ఈ క్రింది నెంబర్లకు 9618249249, 8919564586, 6304011354 ఫోన్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.