గ్రామాల అభివృద్ధి తో రాష్ట్ర అభివృద్ధి

Published: Thursday July 08, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని పైల్వాన్ పురం గ్రామంలో రైతు వేదిక, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, సిసి రోడ్లు, వైకుంఠదామా లను మరియు దాసిరెడ్డి గూడెం గ్రామంలో వాటర్ ఫిల్టర్ ను ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు పైళ్ల శేఖర్ రెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టిందని, గ్రామాల అభివృద్ధి తోనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని,గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందంజలో ఉందన్నారు.గ్రామంలో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు కోఆర్డినేటర్ అమరేందర్, ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పిటిసి వాకిటి పద్మ అనంతరెడ్డి, వైస్ ఎంపీపీ బాత రాజు ఉమా బాలనరసింహ, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు డేగల పాండు యాదవ్, సర్పంచులు తుమ్మల వెంకట్ రెడ్డి, కొమురెల్లి సరితా సంజీవరెడ్డి, గూడూరు శివశాంతిరెడ్డి, ఎంపీటీసీలు చేగురి భారతమ్మ గోపాల్, నోముల మల్లేష్, తహసీల్దార్ కె నాగలక్ష్మి, ఎంపీడీవో లెక్కల గీతా రెడ్డి, ఆర్ ఐ కరుణాకర్ రెడ్డి, రెవిన్యూ సిబ్బంది, గ్రామ పంచాయతీ వార్డ్ నెంబర్లు, సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.