భారీ వర్షాలకు నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలి ** సిపిఎం(మార్క్సిస్ట్) జిల్లా కార్యదర్శి కూశన రాజ

Published: Tuesday July 19, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై18 (ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లాలో భారీ వర్షాల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్) జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం కుపలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ (మార్క్సిస్ట్) జిల్లా  కార్యదర్శి కుశన రాజన్న మాట్లాడుతూ గత 15 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అనేక విధాలుగా  నష్టపోయారని, జిల్లాలో చాలా ఇండ్లు పూర్తిగా కూలి పోయాయని, దరఖాస్తు చేసుకున్న కానీ రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు సర్వేలు చేయడం లేదని, అనేక గ్రామాలకు రోడ్లు  కొట్టుకుపోయి, రవాణా వ్యవస్థ దెబ్బతిని, హాస్పిటల్స్, ఇతర అత్యవసరం ఉన్నా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కావున అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే చేయించి నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని కోరారు. పంట నష్టపరిహారాన్ని సర్వే చేయించి వాణిజ్య పంటకు ఎకరాకు రూ 40 వేలు, ఆహార పంట కు రూ 20 వేలు, నష్టపరిహారం ఇవ్వాలన్నారు. భద్రాచలంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు, కేబీ జిల్లాలో ప్రతి కుటుంబానికి కూడా నెలకి 20 కేజీల బియ్యం తో పాటు 16 రకాల నిత్యావసర సరుకులు రేషన్ షాపుల ద్వారా ఇవ్వాలన్నారు. భారీవర్షాల పట్ల ప్రజలు ఇప్పటికీ రోగాల బారిన పడి అనేక గ్రామాలలో చాలామంది వివరాలతో ఉన్నారన్నారు. జిల్లా మొత్తం వైద్య శిబిరాలు నిర్వహించి మందులు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం (మార్క్సిస్టు) జిల్లా కమిటీ సభ్యులు కోట శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు దుర్గం దినకర్, గోడిసెల కార్తీక్, జిల్లా కమిటీ సభ్యులు అల్లూరి లోకేష్, ముంజం  ఆనంద్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area