టిపీసీసీ మెంబర్ గా ఎన్నికైన రాయల నాగేశ్వరరావు

Published: Wednesday September 21, 2022
పాలేరు సెప్టెంబర్ 20 ప్రజాపాలన ప్రతినిధి
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండల కేంద్రము లో తెలంగాణ పీసీసీ మెంబర్ గా ఎన్నికైన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల నాగేశ్వరరావు,శుభాకాంక్షలు తెలియజేసి నేలకొండపల్లి మండల కేంద్రంలో ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జెర్రీపోతుల అంజనీ, ఆధ్వర్యంలో ఘనంగా బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి జెర్రీపోతుల అంజనీ మాట్లాడుతూ.కాంగ్రెస్ పార్టీ లో నిరంతరం ప్రజా సమస్యల పై పోరాడే నాయుకుడు రాయల నాగేశ్వరరావు అలాంటి కష్ట పడి పని చేసే వ్యక్తికి పిసిసి మెంబర్ గా పదివి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రతేక ధన్యవాదాలు తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో
 ఎస్.కె.యాకుబ్,రాచకొండ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు........