కలక్టర్ కు వినతిపత్రం అందజేసిన జర్నలిస్టులు సానుకూలంగా స్పందించిన కలెక్టర్ వి పి గౌతమ్.

Published: Friday June 17, 2022
పాలేరు జూన్ 16. ప్రజాపాలన. ( ప్రతినిధి)
నేలకొండపల్లి మండల కేంద్రంలో ఇళ్ల స్థలాలు కోల్పోయిన జర్నలిస్టులకు వేరే చోట తిరిగి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కు జర్నలిస్టులు వినతిపత్రం అందజేశారు. గురువారం కోనాయిగూడెం, నేలకొండపల్లి గ్రామాల్లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా  నేలకొండపల్లి మండల కేంద్రంలో 2008 లో సర్వే నెంబరు 159/1 లో అప్పటి మంత్రి సంభాని చంద్రశేఖర్ చేతుల మీదుగా 10 మంది విలేకరులకు 200 గజాలు చొప్పున పట్టాలు అందజేశారని. అట్టి స్థలాల మీదుగా కోదాడ - కురవి జాతీయ రహదారి నిర్మాణంలో స్థలాలు కోల్పోయిన జర్నలిస్టులకు ప్రత్యామ్నాయంగా వేరే చోట స్థలాలు ఇప్పించాలని కోరుతూ కలక్టర్ కు వినతిపత్రం అందజేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు ఈ కార్యక్రమంలో  టియుఢబ్ల్యుజె (ఐజెయు) జిల్లా సహాయ కార్యదర్శి పోలంపల్లి నాగేశ్వరరావు, ఎలక్ట్రానిక్ మీడియా  జిల్లా కమిటీ సభ్యులు పివి నాగిరెడ్డి, నేలకొండపల్లి ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు పెంటమళ్ల కోటయ్య,  మైసా శ్రీనివాసరావు,గంజికుంట్ల వెంకన్న, జర్నలిస్టు సంఘం నాయకులు పి. శ్రీనివాస రెడ్డి,  పసుమర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు