పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలి

Published: Saturday June 12, 2021
పరిగి, జూన్ 11, ప్రజాపాలన ప్రతినిధి : ఏఐసీసీ అదేశాల మేరకు అడ్డగోలుగా పెరిగిన పెట్రోల్ , డీజల్ ధరలకు వ్యతిరేకంగా పెట్రోల్ బంకు ల ముందు నిరసన కార్యాక్రమము చేపట్టడం జరిగింది. వికారాబాద్ జిల్లా,దోమ మండల కేంద్రంలో గల పెట్రోల్ బంక్ ముందు నల్ల బ్యడ్జ్ ల ను ధరించి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు...పెట్రోల్ మరియు డీజల్ కొరకు వచ్చిన వినియోగదారులను వారి అభిప్రాయము అడిగి తెలుసుకొని..నల్ల బ్యాడ్జ్ ను ధరించి మా నిరసన కు మద్దతు తెలపాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా వినియోగదారులు పెట్రోల్ డీజిల్  ధరల పై తీవ్రమైన ఆగ్రహము వ్యక్తపరిచారు.  కొవిడ్ కారణంగా ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే..దానికి తోడు ఇందనము ధరలు పెరగడం కేంద్రప్రభుత్వ సామాన్యుడి పై కర్కషత్వమే ప్రదర్శించడం  దురదృష్ట కరమని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలి విజయ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు భారీగా పతనమైన .విపరీతమైన పన్నులు వేసి అధికారికంగానే దోపిడీ చేస్తుందని అలాగే గత 7 సం: గా మోడీ ప్రభుత్వ ఇంధనం మీద వేసిన టాక్స్ విలువ సుమారు 40 లక్షల కోట్లు.. పేద వాన్ని కొట్టి పెద్దలకు సంతర్పణ చేయడము ప్రభుత్వ పనిగా పెట్టుకోవడము దురదృష్టకరం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి  రమేశ్ గౌడ్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి, చాపల శ్రీనివాస్, చంద్రయ్య, బోయిని వెంకటయ్య, ఇక్కి శివకుమార్, జావేద్, దుద్యల మల్లేశ్ యాదవ్, గుండల్ రామచంద్ర రెడ్డి, గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు.