108, 104 సిబ్బందికి నూతన వస్త్రాల పంపిణీ.

Published: Tuesday October 12, 2021

మంచిర్యాల బ్యూరో, అక్టోబర్11, ప్రజాపాలన : కరోన సమయంలో రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించడంలో కీలక భూమిక పోషించిన 108, 104, ప్రభుత్వ అంబులెన్స్ ఉద్యోగులకు కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు ఆద్వర్యంలో సోమవారం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ చేతులమీదుగా మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాస గృహంలో నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాదాపు150 మంది ఉద్యోగుల కు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సురేఖ మాట్లాడుతూ అర్హులైన మిగతా ఉద్యోగుల జాబితా ప్రకారం నూతన వస్త్రాలు అందించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. కరోణ విస్తృతంగా ఉన్న సమయంలో రోగులను ఆస్పత్రికి చేర్చడంలో, వైద్య సేవలు అందించడంలో 108, 104, అంబులెన్స్ సిబ్బంది ఎంతో సేవ చేశారని కొనియాడారు. సమాజానికి సేవ చేసిన ఈ మూడు విభాగాల సిబ్బందిని సత్కరించాలనే సంకల్పంతో నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. ప్రజాసేవలో ముందు వరుసలో నిలిచే వారిని గౌరవించాల్సిన అవసరం సమాజము పై ఉందని సురేఖ అన్నారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి జడ్పీటీసీ నాగరాణి-త్రిమూర్తి, మంచిర్యాల మున్సిపాలిటీ డిప్యూటి ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్, నస్పూర్ ఫ్లోర్ లీడర్ సుర్మిళ వేణు, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత, పట్టణ అధ్యక్షురాలు గజ్జెల హేమలత, నాయకులు, ముని, బాలరాజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.