నిరు పేదలకు ఉపయోగ పడుతున్న వస్త్ర బ్యాంక్

Published: Thursday June 30, 2022
పలువురు దాతల వితరణ అభినందనీయం
మార్కెట్ యార్డ్ చైర్మన్ మధిర జూన్ 2 9. ప్రజా పాలన ప్రతినిధి మధిర పట్టణంలో స్థానిక అజాద్ రోడ్ లో ప్రముఖ సామాజిక సేవకులు లంకా కొండయ్య (లంకా సేవా ఫౌండేషన్ నిర్వాహకులు )ఆధ్వర్యంలో నడుస్తున్న *మహాత్మా గాంధీ ఓల్డ్ క్లాత్ బ్యాంక్* ద్వారా వివిధ దయ హృదయలు దాతలు అందించిన పాత బట్టలును మంగళవారం రాత్రి స్థానిక మార్కెట్ యార్డ్ లో నివాసం ఉంటున్న రాజమండ్రి వలస కూలీలు (మున్సిపాలిటీ నందు మురికి కాలువలందు పూడిక తీసే ప్రత్యేక కూలిలకు )ఆ కుటుంబాలకు సరిపడా బట్టలను చిత్తారు నాగేశ్వరావు గారి బృందం ద్వారా అందించారు. ఈ సందర్బంగా చిత్తారు నాగేశ్వరావు మాట్లాడుతూ గత  2012 నుండీ వేలాది మందికి పాత బట్టలు సేకరించి తీరిక సమయం లో, సెలవు దినాలో అనేక మంది నిరుపేదలకు, ఆభాగ్యలుకు అందించించడం అభినందనీయం అని తెలిపారు. మన ఇంట్లో అదనపు దుస్తులు మరొకరికి ఉపయోగం అంటూ ప్రతి ఒక్కరు ముందుకి వచ్చి ఇలా నిరుపేదలకు సహాయపడాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమం లో మండల టిఆర్ఎస్ కార్యదర్శి శ్రీ బొగ్గుల భాస్కర్ రెడ్డి, మర్లపాడు సొసైటీ చైర్మన్ శ్రీ కటికల సీతారామ రెడ్డి,  నియోజకవర్గ యూత్ కన్వీనర్ శ్రీ కూన నరేందర్ రెడ్డి, రామచంద్ర పురం గ్రామ సర్పంచ్ శ్రీ మార్తా నర్సింహా రావు, వెంకటాపురం వైస్ ప్రెసిడెంట్ శ్రీ హరి కిరణ్ (బంగారన్న ),AMC సూపెర్వైసోర్ జగదీశ్, లంకా సేవా ఫౌండేషన్ నిర్వాహకులు గోపి,సన్నీ,శ్యామ్, అంజి, వెంకీ కరుణ పాల్గొన్నారు.