రైతుల సౌకర్యార్థం కోడిసెలోర్రే పై వంతెననిర్మాణం. ..తిమ్మాపూర్ సర్పంచి జాడి గంగాధర్

Published: Thursday June 10, 2021

జన్నారం, జూన్ 09, ప్రజాపాలన : మండలం లోని తిమ్మాపూర్ గ్రామంలో రైతుల సౌకర్యార్థం పంటపొలాలకు , వైకుంఠ ద్వామం వైపు వెళ్ళె రహాదారికి అడ్డంగా ఉన్న కోడిసెలోర్రే (వాగు) పై వంతెన నిర్మాణ పనులకు బుధవారం ఆ గ్రామ సర్పంచ్ జాడి గంగాధర్ భూమి పూజ నిర్వహించి పనులు ప్రారంభించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత సహకారంతో ఐదు లక్షల వ్యయంతో ఈ వంతెన నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పండించుకున్న పంటను.రైతులు ఇండ్లలో కి తెచ్చుకోవడం కోసం ఈ వాగువద్ద రహాదారి అస్థవ్యస్థమై ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ట్రాక్టర్లు ,ఎడ్లబండ్లు , ఆటోలు ,వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో ఈ విషయం ఎంపి దృష్టికి తీసుకెళ్ళగా వంతెన నిర్మాణ ంకోసం నిధులు విడుదల చేశారని తెలిపారు. తన స్వంత గ్రమాన్ని అన్ని విదాలుగా అభివృద్ధి చేస్తానని గ్రమప్రజలకు హామీ ఇచ్చినట్టు గానే అనేక అభివృద్ధి పనులు మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్  ఆసునూరి పద్మ,, కార్యదర్శి లావణ్య, వార్డు సభ్యులు, సిందం చంద్రయ్య, కోవా భూమయ్య ,జాడిలక్ష్మి , జునుగురి లక్ష్మీ ,జాడివెంకట్, జాడి రాజన్న, గ్రామ పెద్దలు లచ్చయ్య, దాడిపోచన్న ,సిందం శ్రీనివాస్ దితరులు పాల్గొన్నారు.