విలేఖరులకు ఇండ్ల స్థలాల కేటాయింపు పై సానుకూల స్పందన. ...జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద

Published: Tuesday February 21, 2023
మంచిర్యాల బ్యూరో, ఫిబ్రవరి 20, ప్రజాపాలన :
 
జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు   కలిసి పని చేయాలని, అదేవిధంగా సమిష్టిగా కృషి చేద్దామని ( మీడియా ప్రతినిధులతో ) జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో పకడ్బంధీగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.  ఈ క్రమంలో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పని చేస్తున్న మీడియా ప్రతినిధులు పథకాల పురోగతిని ప్రచారం చేయడంతో పాటు లోపాలను గుర్తించి పరిష్కరించే దిశగా ప్రభుత్వంతో కలిసి కృషి చేయాలని కోరారు . 
 
* పాత్రికేయుల ఇండ్ల స్థలాల కేటాయింపు పై సానుకూలత.
 
పాత్రికేయులు అద్దె ఇండ్లలో ఉంటూ అవస్థలు పడుతున్నారని, ఇండ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని ప్రజాపాలన విలేఖరి కోరగా జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హత గల ప్రతి జర్నలిస్టు సంక్షేమాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా జిల్లా అభివృద్ధిలో కలిసి పని చేద్దామని అన్నారు.  ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసంబంధాల అధికారి వై.సంపత్ కుమార్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.