వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును రవాణా చేయాలి - సింగరేణి మార్కెటింగ్, మూమెంట్ జీఎం ఎం.సురేష్

Published: Saturday May 28, 2022
నస్పూర్, మే 27, ప్రజాపాలన ప్రతినిధి: వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును రవాణా చేయాలని సింగరేణి మార్కెటింగ్, మూమెంట్ జీఎం ఎం.సురేష్ అన్నారు. శుక్రవారం ఆయన శ్రీరాంపూర్ జీఎం బి.సంజీవరెడ్డితో కలసి ఏరియాలోని కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటు, ఓపెన్ కాస్ట్ గనిని సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పెరుగుతున్న విద్యుత్ వినియోగం వల్ల ఎక్కువ బొగ్గు ఉత్పత్తి, రావాణా చేయడం అత్యంత ఆవశ్యకమని అన్నారు. వీలైనంత ఎక్కువ బొగ్గును ఉత్పత్తి చేస్తూ వినియోగదారులకు నాణ్యమైన గ్రేడ్ బొగ్గును రవాణా చేయడానికి ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్,  ఓపెన్ కాస్ట్ గని నుండి రోజువారి బొగ్గు ఉత్పత్తి పెంచి సరైన సమయానికి బొగ్గును రవాణా చేయాలని సూచించారు. వ్యూ పాయింట్ నుండి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న పని ప్రదేశాలను వారు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో  కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్  డీజీఎం డివి. రావు, శ్రీరాంపూర్ ఓసీపీ గని ప్రాజెక్ట్ ఆఫీసర్ పురుషోత్తమ రెడ్డి, గని మేనేజర్  కె.జనార్ధన్, డీజీఎం మార్కెటింగ్ టి.శ్రీనివాస్, గని సర్వే అధికారి సంపత్, ప్రాజెక్ట్ ఇంజనీర్ చంద్రశేఖర్, క్వాలిటీ ఇన్చార్జి కె.వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.