రోగి కార్చే కన్నీటి బొట్టు.సప్త సముద్రాలలోని నీటి కంటే విలువైనది స్వామి

Published: Monday June 13, 2022
వివేకానంద మధిర జూన్ 13న ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు కూలీ,నాలి చేసుకొని జీవించక తప్పదు. మరి దీనికి తోడు వృద్ధాప్యం మీదపడటం అనుకోని పరిస్థితిలో కొందరు అనారోగ్యానికి గురికావటం దీని వలన జీవన యాత్ర కుంటుపడటం ఎటూతోచని కన్నీటి పర్యంతం అందుకే స్వామి వివేకానంద చెప్పారు రోగి కార్చే కన్నీటి బొట్టు సప్త సముద్రంలలోని నీటి కంటే విలువైనది అనిల్  దీనిని ఆదర్శoగా
తీసుకొని ప్రముఖ సామాజిక సేవకుడు లంకా కొండయ్య తనకు కనిపించిన అనారోగ్య బాధితుల యెక్క భాదలను పంచుకొని మానవ సేవే భగవంతుడు సేవగా భావించి అనేక మంది దీర్ఘకాలిక రోగుల గురించి దాతలకు తెలియపరచి  వారికి కావలిసిన సహాయం చేపిస్తున్నారు. ఈ సేవలో భాగంగా దెందుకూరు బీసీ కాలనీలో షుగర్ వ్యాదితో కుడి కాలు కోల్పోయిన ఒక నిరు పేద వృద్ధునికి నేనున్నా నీకేమి కాదని అదే గ్రామంలో మనసున్న దయాహృదయులు శ్రీ ఎడ్లపల్లి బాలకృష్ణ తనకు ఉన్నదానిలో సాటి మనిషికి సహాయం చేద్దాం అనే ఆలోచన తో ఒక నెలకు సరిపడ బియ్యం దాతృత్వంతో ఆదివారం ఉదయం లంకా కొండయ్య ద్వారా అందించినారు. ఈ విధంగా ఆపదలో ఉన్న వారిని ప్రతి ఒక్కరు ఆదుకోవాలి అని హృదయ పూర్వక అభినందనలు తెలిపినారు కొండయ్య.