మీర్ పేట్ కార్పొరేషన్ లోనీ అక్రమాలపై చర్య తీసుకోవాలని ఎమ్మెల్యే రాజసింగ్ లోథ కు వినతి

Published: Tuesday March 16, 2021
బాలాపూర్ :( ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్; మీర్ పేట కార్పొరేషన్ లోని 37 వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులు, ట్రంక్ లైన్, అదేవిధంగా చెరువులు సుందరీకరణ లో భాగంగా ఎమ్మెల్యే రాజ్ సింగ్ లోధ కు వినతి పత్రం సమర్పించారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 37 డివిజన్ కార్పొరేటర్ మోడల్ బాలకృష్ణ, అదేవిధంగా 36వ డివిజన్లో కూడా, 34 వ డివిజన్ కార్పొరేటర్ మన్నెమ్మ తనయుడు శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో రెండు డివిజన్లో అభివృద్ధి పనులు జరుగుతూ లేవునీ ....? డ్రైనేజీ, వీధి దీపాలు, రోడ్లు అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న చెరువులు సుందరీకరణ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇక్కడున్నా నేతలు పట్టించుకోవడంలేదని ఎమ్మెల్యేకు  బిజెపి కార్పొరేటర్లు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి నేతలు మాట్లాడుతూ... గతంలో భారీ వర్షాల వల్ల దాదాపు 15 నుండి 20 కాలనీల ఎమ్ ఎల్ ఆర్ కాలనీ, జయ శ్రీ నగర్ కాలనీ, తిరుమల ఎంక్లేవ్, శ్రీ లక్ష్మీ నరసింహ్మ కాలనీ, శివాజీ నగర్, గాంధీ నగర్, ప్రగతి నగర్ కాలనీ, శ్రీ శివ సాయి నగర్ కాలనీ, అయోధ్య నగర్ కాలనీ, శ్రీ వినాయక నగర్ కాలనీ, బాలాజీ నగర్, సర్వోదయ నగర్ కాలనీ, వరకు పూర్తిగా నీట మునిగి పోయినందున నెల రోజులు కాలనీవాసుల 10 కోట్లు నుండి 20 కోట్ల వరకు ఆస్తి నష్టం కలిగింది అన్నారు. నీటమునిగిన ఇంటికి పదివేల రూపాయలు, సగం ఇల్లు పడిపోయిన వారికి 50,000 రూపాయలు, ఇల్లు పూర్తిగా  కోల్పోయిన వారికి  లక్ష రూపాయలు అన్నారు. కానీ ఆ మాట నిలబెట్టుకుని టిఆర్ఎస్ పార్టీ, డ్రైనేజీ పనులు, రోడ్డు పనులు,23 కోట్ల ట్రంక్ లైన్  పనులు  ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు కూడా  నత్తనడక నడుస్తోందిని అన్నారు. చేసే పనులు కూడా నాణ్యత లేవని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ సంద చెరువు దగ్గర ఉన్న టిఆర్ఎస్ నాయకులు ఎస్ వై ఆర్ ఫంక్షన్ హాల్ పేరు మీద దాదాపు నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు కబ్జా చేస్తున్నారని, ఈ ఫంక్షన్ హాల్ మీద ఇప్పటికీ ప్రతి అధికారికి విన్నవించుకున్నా చీమకుట్టినట్టు కూడా ఎవరికి ఏమి కాలేదని హెచ్చరిస్తూ బాధను వినిపించు కున్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు తప్పక ఉండేటట్లు చూడాలని, అదేవిధంగా సంధ చెరువు, మంత్రాల చెరువు, పెద్ద చెరువు సుందరీకరణ భాగంగా  తొందరలో పనులు పూర్తి కావాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి గాజుల మధు,  తదితరులు పాల్గొన్నారు.