ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల కరపత్రాలు విడుదల

Published: Thursday November 10, 2022
జన్నారం నవంబర్ 09, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాలలో బుధవారం ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల కరపత్రాలను విడుదల చేయడం జరిగిందని ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు దుమాల్ల ఎనోష్, కార్యదర్శి జాడి అజయ్, అన్నారు. 
ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దాగం శ్రీకాంత్, మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ
డిసెంబర్ 13వ తేది నుంచి 16వ తేది వరకు తెలంగాణ రాష్ట్రంలో  హైదరాబాద్ లో SFI జాతీయ 17వ మహాసభలు జరుగుతున్నాయని, ఈ మహాసభలలో దేశ విద్యారంగంలో ఎన్ ఈ పి పేరుతో అసమానతలు పెంచి, విభజన చేసే విధానాలను బిజెపి తీసుకుని వస్తుంది. 
ప్రభుత్వ విద్యారంగాన్ని విస్మరించి కార్పోరేట్ శక్తులకు విద్యారంగాన్ని ధరాదత్తం చేస్తుందని, దేశంలో గత 8 యేండ్లలో బిజెపి ప్రభుత్వం విద్య, ఉపాధి రంగాలను నిర్లక్ష్యం చేసిందని అన్నారు. 
యూనివర్శీటీలను నిర్లక్ష్యం చేస్తూ నిధులు ఇవ్వకుండా భారీగా ఫీజులు పెంచి విద్యకు పేద ప్రజలను దూరం చేసే విధానాలు చేపడుతుందన్నారు. 
 
17వ జాతీయ మహాసభ అందరికి విద్య, అందరికీ ఉపాధి దేశమందరం ఐక్యం చేద్దాం అనే నినాదం
 
 17వ మహాసభ అందరికీ విద్య, అందరికి ఉపాధి, దేశం అందరం ఐక్యం చేద్దాం, అనే నినాదాన్ని తీసుకుందని 
ఈ మహాసభలలో దేశంలో విద్యా వ్యాపారీకరణ, కార్పోరేటీకరణ, విద్యారంగంలో కషాయికరణకు వ్యతిరేకంగా  ఉద్యమించనున్నట్లు తెలిపారు. నూతన విద్యావిధానం పేరుతో ఆరెస్సెస్ భావాజాలన్ని విద్యలో ప్రవేశపెట్టి సిలబస్ మార్చివేసి, చరిత్రను వక్రీకరిస్తుందని అన్నారు. దేశంలో ఉన్న ఉన్నత స్థాయి విద్యాసంస్థలలో ఫ్రోఫెసర్ పోస్టులు భర్తీ చేయకుండా  ఉన్నత విద్యలో అణాగారిన వర్గాలకు ఈ విద్యాసంస్థలలో స్థానం లేకుండా చేస్తున్నారు. ఆరెస్సెస్ చెందిన వ్యక్తులను యూజీసీ చైర్మన్ గా నియమించి యూనివర్శీటీలలో ప్రజాస్వామ్య వాతవరణాని లేకుండా చేస్తుందని తెలిపారు. దేశంలో 29 రాష్ట్రాల నుండి 1000 పైగా ప్రతినిధులు 
ఈ మహాసభలకు హాజరైతారని  తెలిపారు. తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఆలిండియా మహాసభలను నిర్వహిస్తున్నామని  ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియాలో ఈ మహాసభలు జరుగుతున్నాయని వారన్నారు. ఈ కార్యక్రమంలోఎస్ఎఫ్ఐ
జన్నారం మండల అధ్యక్షుడు దుమ్మల ఎనోష్ కార్యదర్శి అజయ్ జాడి, తదితరులు పాల్గొన్నారు.