ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి

Published: Wednesday September 22, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్21, ప్రజాపాలన : తెలంగాణ బీసీ జాగృతి ఆధ్వర్యంలో హైటెక్ సిటీ లో గల బిసి జాగృతి కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొండా లక్ష్మణ్ బాపూజీ గారు 1915లో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా మారుమూల గ్రామమైన వాంకిడి మండల కేంద్రంలో జన్మించారని, తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయి తన మేనత్త దగ్గర పెరిగిన లక్ష్మణ్ బాపూజీ దేశ స్వతంత్ర ఉద్యమం దగ్గర నుండి నేటి తెలంగాణ ఉద్యమం వరకూ తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాలకు అంకితం చేసిన గొప్ప ఉద్యమకారుడని అన్నారు. ఈ సమాజం మేల్కొనక ముందే బీసీ సంఘాన్ని నెలకొల్పి బీసీలకు రాజ్యాధికారం ఆవశ్యకతను తెలిపినటువంటి గొప్ప వ్యక్తి అని అన్నారు. 1969లో తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించి జైలుకు వెళ్లినటువంటి ధైర్యశాలి తన మంత్రి పదవిని సైతం తృణప్రాయంగా వొదులుకుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాతనే మళ్లీ మంత్రి పదవి స్వీకరిస్తానని చెప్పి గొప్ప రాజనీతిజ్ఞుడు మన లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. తన 90 ఏళ్ల వయసులో ఢిల్లీలోని జంతర్మంతర్లో ఒకపక్క ఎముకలు కొరికే చలిని కూడా లెక్కచేయకుండా దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి చాటిచెప్పిన గొప్ప పోరాట యోధుడని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సరైన గుర్తింపు ఇచ్చి జయంతిని వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని ఆయన విగ్రహాన్ని హైదరాబాదులో గల ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని తెలంగాణ బీసీ జాగృతి డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా తెలంగాణ బీసీ జాగృతి అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్, కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, జిల్లా మీడియా కన్వీనర్ మోదపురం సంతోష్ ఆచార్య, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మేoత్యల సంతోష్, వైద్య భాస్కర్, గంధ శ్రీ తిరుపతి, కార్యదర్శి కీర్తి బిక్షపతి, సహాయ కార్యదర్శి బద్ది శ్రీను, ప్రచార కార్యదర్శి నగునూరి లక్ష్మణ్, కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మల శ్రీనివాస్, మహిళా నాయకురాలు భీమరి విజయ, కార్యవర్గ సభ్యులు కుదురుపాక రవీందర్, చదువుల వినోద్, మిట్ట మధుసూదన్, నడిమెట్ల నరేష్, నీలం శంకర్, తదితర బిసి సోదరులు పాల్గొన్నారు.