నటరత్న, తెలుగు తేజం నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు

Published: Wednesday January 19, 2022
ఎర్రుపాలెం జనవరి 18 ప్రజాపాలన ప్రతినిధి : తెలుగు జాతికి వన్నె తెచ్చిన నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి వేడుకలు ఎర్రుపాలెం లోని గాంధీ సెంటర్లో మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అన్నదానం చేశారు. అనంతరం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దోమందుల సామేలు మాట్లాడుతూ నాడు తెలంగాణ ప్రజలను నిలువునా దోచేస్తున్న పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దు చేసి ప్రజలకు స్వాతంత్య్రం మరోమారు తెచ్చిన గొప్ప ఘనుడు ఎన్టీఆర్ అని తాలూకా వ్యవస్థకు చరమగీతం పాడి మండల వ్యవస్థను స్థాపించి ప్రజల వద్దకు పాలన తెచ్చిన వ్యక్తి అని ఎన్టీఆర్ శిష్యుడిగా ఆయన పాలనకు తలదన్నేలా ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జనరంజకమైన పాలన చేపట్టారన్నారు. పేదలు, రైతులకు పాలనలో మొదటి ప్రాధాన్యత ఇచ్చిన ఎన్టీఆర్ రీతిలోనే నేడు సీఎం కేసీఆర్ సైతం ఎన్నో పేద, రైతు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని దోమందుల సామేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి గురిజాల సత్యనారాయణ, సర్పంచి మొగిలి అప్పారావు, గోసు రామారావు, గూడూరు వెంకటేశ్వరరెడ్డి, పట్టణ అధ్యక్షుడు షేక్ లాలు, దేవరకొండ మోహనరావు, నాగిరెడ్డి, భాస్కరరావు, అజ్జూజానీ, శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.