బతుకమ్మ పండుగ చీరెలు పంపిణీ...

Published: Monday October 04, 2021
జగిత్యాల, అక్టోబర్ 03 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల పట్టణంలోని 12వ వార్డు గాంధీనగర్ లోని ఉప్పరిపేట్ యాదవ సంఘ భవనంలో బతుకమ్మ పండగ చీరలను స్థానిక కౌన్సిలర్ నక్క జీవన్ కుమార్ పంపిణీ చేశారు. మొదటి రోజు చీరల పంపిణీ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుకుంటూ వార్డులోని ప్రతి ఒక ఆడపడుచుకు చీరలు అందాలని ఆర్పీ అంగన్వాడీలకు జీవన్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ జ్యోతి అంగన్వాడీ టీచర్ వైశాలి స్పెషల్ ఆఫీసర్ ప్రసాద్ స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.