ఏర్రుపాలెం కరపత్రాలు ఆవిష్కరిస్తున్న మాదిగ ఉద్యోగస్తులు.

Published: Monday October 18, 2021
ఎర్రుపాలెం, అక్టోబర్ 17, ప్రజాపాలన ప్రతినిధి : ఈ నెల 24న హైదరాబాదులో జరిగే మాదిగ ఉద్యోగస్తుల ఐదవ జాతీయ మహాసభ ను జయప్రదం చేయాలని జిల్లా మాదిగ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కొత్తపల్లి గురుప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం ఎర్రుపాలెం, రింగ్ సెంటర్లో ఎస్సీ వర్గీకరణ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశం మండల అధ్యక్షులు మారా బత్తుల జమలయ్య, అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు కూరపాటి ప్రభాకర్ మాదిగ, హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్తపల్లి గురు ప్రసాద్ మాట్లాడుతూ ఈ జాతీయ సభకు ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, కేంద్ర మంత్రులు కిషరెడ్డి, నారాయణస్వామి, లోకనాథ్న్ మరుగన్, అలానే వివిధ మంత్రులు హాజరవుతున్నారని అన్నారు. చదువుకున్న యువతీయువకులు వర్గీకరణ అమల్లో లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోయారని అన్నారు. తక్షణమే పార్లమెంట్లో బిల్లు ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిచెరుకుపల్లి వెంకయ్య, రాష్ట్రకార్యదర్శి గద్దల బాబు, జిల్లా ఉపాధ్యక్షులు సగుర్తిప్రకాష్, జిల్లా కార్యదర్శి తుంగా గోపాల్, చెరుకుపల్లి మురళి, ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మేకల రమేష్, లింగాల నాగేశ్వరరావు, సగ్గుర్తి రవి, నండ్రు వెంకటేశ్వర్లు, సగ్గుర్తి అలెగ్జాండర్, సగ్గుర్తి మోజేష్,