ఎస్ ఐ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్స్ జారీ చేయాలి

Published: Saturday November 05, 2022

మంచిర్యాల టౌన్, నవంబర్ 04, ప్రజాపాలన:  ఎస్ ఐ కానిస్టేబుల్ అభ్యర్థులకు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్లు జారీ చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టర్ కార్యాలయ ఎ ఒ కు ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం  అందజేశారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు చిప్పకుర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో జరిగిన ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో ప్రిలిమ్స్ ఉత్తీర్ణులైన అభ్యర్థులను శారీరక దారుఢ్య పరీక్ష , మెయిన్స్ పరీక్షల నిమిత్తం లోకల్ క్యాండిడేట్ నిర్ధారణ కోసం ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు స్టడీ, కండక్ట్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయాలని, ఎవరికైనా 1వ నుండి 7వ తరగతి వరకు సర్టిఫికెట్స్ లేని పక్షంలో స్థానిక తహసిల్దారు చే రిక్రూట్మెంట్ బోర్డ్ సూచించిన ఫార్మాట్లో సంతకం చేయించి అప్లోడ్ చేయాలని సూచించడం జరిగింది కానీ కొన్ని మండలాల్లో తహసిల్దారులు తమకు ఉన్నతాధికరుల నుండి ఎలాంటి ఆదేశాలు లేవని అభ్యర్థులను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఫిజికల్ ఈవెంట్స్ కోసం సాధన చేయలేకపోతున్నారని అన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్  స్పందించి అన్ని మండలాల తాసిల్దారులకు ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్స్ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, సల్మాన్ పాష,పురెళ్ళ నితీష్,జంగపెల్లి పవన్ లు పాల్గొన్నారు.