ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను సందర్శించిన అడిషనల్, అసిస్టెంట్ కలెక్టర్లు

Published: Wednesday April 19, 2023
బోనకల్ ఏప్రిల్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మంగళవారం అడిషనల్ కలెక్టర్ స్నేహలత,అసిస్టెంట్ కలెక్టర్ రాధికా గుప్తా సందర్సించారు.
ప్రతి మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు జరిగే ఆరోగ్య మహిళా క్లినిక్ ను సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలో
 వివిధ కౌంటర్ ల నందు ఎం పనులు చేస్తున్నారో స్టాఫ్ ను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ గా సమస్యలు ఉన్న ఆడ వాళ్ళని గుర్తించి వాళ్ళకి వైద్య పరీక్షలు చేయాలనీ అనుమానితులను గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మం కు పంపాలని సూచించారు. ఇంకేమైనా అవసరతలు ఉన్నాయేమో అడిగి తెలుసుకుని లోకల్ సెక్రటరి ని ఏర్పాటు చేయమని చెప్పారు.సమస్యలు ఉన్న ఆడవాళ్ళని గుర్తించటం లో వైద్య సిబ్బంది ఎక్కువ కృషి చేయాలనీ అన్నారు.సమస్యలు చెప్పుకోటానికి వీలుగా ప్రైవసీ ఉండేలాగా చూసుకోమన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాన్పుల గురించి అడిగారు. రాత్రి ప్రసవం జరిగిన మహిళ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.కాన్పుల సంఖ్య పెంచాలని,పూర్వం కాయకల్ప వచ్చిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గనుక సిబ్బంది అందరూ ఎక్కువ కృషి చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ బోడెపుడి వేణుమాధవ్, ఎం పి ఓ వ్యాకరణ సుబ్రహ్మణ్య శాస్త్రి, ఐసిడిఎస్, ఏసీడీపీఓ , ఐకేపీ ఏపీఎం పద్మలత వారి సిబ్బంది, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.