హరితహారం లో 2006 అర్హులైన పోడు సాగుదారులకు అందరికీ పట్టాలు ఇవ్వాలి. అశ్వాపురం (ప్రజా పాలన.)

Published: Thursday October 27, 2022
పెండింగ్ లో ఉన్న 2006 అటవీ హక్కుల దరఖాస్తు దారులకు కూడా పట్టాలు ఇవ్వాలి
ఎఫ్ ఆర్ సి కమిటీ లో దరఖాస్తు చేసుకున్న నాటికి సాగులో ఉన్న పోడుభూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలి
సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మోరా రవి.
పోడు భూముల సర్వే సమగ్రంగా నిర్వహించి ఎఫ్ ఆర్ సి కమిటీలలో దరఖాస్తు చేసుకున్న
అర్హులైన  గిరిజన, గిరిజనేతర పేదలందరికీ పట్టా హక్కులు కల్పించాలని, గతంలో పెండింగ్ లో ఉన్న 2006 అటవీ హక్కుల దరఖాస్తుదారులకు కూడా పట్టాలు ఇవ్వాలని
 సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ పిలుపులో భాగంగా న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో అశ్వాపురం తహసిల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. తహసిల్దార్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. పై అధికారులకు నివేదిస్తామని  ధర్నాను ఉద్దేశించి తెలిపారు.
ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ కమిటీ కార్యదర్శి మోరా రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కారానికి చేపట్టిన చర్యలు గతంలో ఉన్న 1/70, పిసా,  2006 అటవీ హక్కుల చట్టం తో పాటు ఆదివాసీ చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి ఎఫ్ ఆర్ సి కమిటీకి దరఖాస్తు చేసుకున్న నాటికి సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ముఖ్యంగా గతంలో పెండింగ్ లో ఉన్న 2006 అటవీ హక్కుల కమిటీలకు దరఖాస్తు చేసుకుని ఆనాటికే సాగులో ఉన్న అనేకమంది పోడు సాగుదారుల భూములను హరితహారం పేరుతో ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అన్యాయం చేసిందని అన్నారు. పెండింగులో ఉన్న 2006 అటవీ హక్కుల దరఖాస్తులను పరిగణలోకి తీసుకొని వాటికి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
  పోడు భూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పోడు భూముల సర్వే సమగ్రంగా నిర్వహించాలని, 
 లేదంటే అర్హులైన పోడు సాగుదారులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని అన్నారు.
 పోడు వివాదం కొన్ని ప్రాంతాల్లో గిరిజన, గిరిజనేతర పేదల మధ్య కొంత అభద్రతా భావాన్ని నెలకొల్పే విధంగా ఉన్నదని.
కులాల మధ్య భేదాలు చూపకుండా 
పేద, ధనిక తేడాలను చూడాలని, తాతల, తండ్రుల కాలం నుండి పోడు సాగు చేసుకుని జీవిస్తున్న.గిరిజనేతర పేదలకు కూడా భూమిపై హక్కులు కల్పించాలని...
రాజకీయ, ధన బలంతో, బినామీ పేర్లతో పదుల ,వందల సంఖ్యలో పోడుభూమి ఆక్రమించుకున్న ధనికులను వెంటనే తొలగించి, ఆ భూమిని సర్వే చేసి  ఆదివాసి పేదలకు పట్టా హక్కులు కల్పించాలని అన్నారు. కురవపల్లి కొత్తూరు ఆదివాసి గిరిజనుల కు సంబంధించిన పోడు భూములను, గతంలో రెవెన్యూ ఫారెస్ట్ అధికారులు జాయింట్ సర్వే నిర్వహించి వారు ఇచ్చిన రిపోర్టు ఆధారంగా, ఎఫ్ ఆర్ సి కమిటీ కి దరఖాస్తు చేసుకుని,అనుభవదారులుగా ఉన్న ఆదివాసి గిరిజనుల పోడు భూములు
  సర్వే చేసి పట్టా  హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో  అఖిలభారత రైతుకూలీ సంఘం జిల్లా నాయకులు బండ్ల వెంకటేశ్వర్లు, మండల నాయకులు పావురాల లాలయ్య, వంక రామయ్య, పాయం కృష్ణ, కనితి భూపతి , పైదా భద్రయ్య , సోందే గోపమ్మ, గొంది లక్ష్మి , తాటి వెంకటేశ్వర్లు, మెస్స భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.