తమ డిమాండ్లను పరిష్కరించాలని విద్యుత్ ఉద్యోగులు ధర్నా మేడిపల్లి, ఫిబ్రవరి 22 (ప్రజాపాలన ప్రత

Published: Thursday February 23, 2023
విద్యుత్ ఉద్యోగులకు మరియు ఆర్టిజన్ లకు పీఆర్ సీ అమలు చేసి తమ న్యాయమైన 29 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ హెచ్ 82 ఆధ్వర్యంలో ఉప్పల్లోని ఎస్సీ కార్యాలయం వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఆర్టిజన్ ఉద్యోగులు ధర్నా నిరసనను చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు మాట్లాడుతూ 2017లో విలీనియా ప్రక్రియ జరిగి ఐదు సంవత్సరాలు అవుతున్న్న ఇప్పటివరకు పి ఆర్ సి ఇవ్వలేదన్నారు. స్పెషల్ పే తీసి బేసిక్ లో కలపాలని, 
స్టాండింగ్ రూల్స్ ను రద్దుచేసి ఏపీఎస్ఇబి రూల్స్ అమలు చేయాలని,
ఒకే సంస్థలో ఒకే రూల్స్ ఉండాలని వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల పై స్పందించకపోతే కార్పొరేట్ కార్యాలయం ముట్టడి చేయడంతో పాటు సమ్మె కూడా చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సిహెచ్ వెంకట్ రెడ్డి, కొత్త బాబు, బాల్ రెడ్డి, కైలాష్ పతి, రంగు జానయ్య, సర్కిల్ అధ్యక్షులు బి సిద్ధులు, ప్రధాన కార్యదర్శి రొండ్ల ఉపేందర్ రెడ్డి, బి శ్రీను, పి మోహన్ రావు, చైతన్య, బి రవి, నరేష్, బాలరాజ్, ఆంజనేయులు, విజయ్ కుమార్, అనిత, సరిత, సంగీత తదితరులు పాల్గొన్నారు.