వేయని కరోనా టీకాకు - పత్రం

Published: Monday July 12, 2021

యాదాద్రి – భువనగిరి జూలై 11  ప్రజాపాలన : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అందరి బాటుకులను కుదేలు చేసింది. కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలను కాపాడడానికి  ప్రభుత్వం  వివిధ రకాల వ్యాక్సిన్ కు అనుమతులు ఇచ్చింది. 18 సంవత్సరాల వయసు పైబడిన వారందరికీ  ఉచితంగా వ్యాక్సిన్ చేయమని రాష్ట్ర  ప్రభుత్వం అనుమతులు జారీ చేశాయి. వ్యాక్సిన్ అమలు పరచడంలో వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా అవకతవకలు జరుగుతున్నాయి. మచ్చుకు కొన్ని చూడండి. బీహార్ రాష్ట్రం చాప్రలో ఆరోగ్య  సిబ్బంది  సిరంజీలు  మందు ఎక్కించండి వాక్సిన్ వేశారనే వార్తా చక్కర్లు కొడుతున్నది. ఉత్తర్ ప్రదేశ్  అక్బర్  పూర్, మర్ హౌలీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 50 సంవత్సరాల మహిళకు ఏకంగా రెండు వ్యాక్సిన్ లు వచ్చినట్టు వార్త చక్కర్లు. అలిఘర్ జిల్లాలో 29 వాక్సిన్ నింపిన సిరంజీలు చెత్త బుట్టలో పడవేసినది అనే కారణంగా ఆరోగ్య కార్యకర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. అచ్చం ఇలాంటి సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చోటుచేసుకున్నది. భువనగిరి మండలానికి చెందిన ఒక మహిళ తనకు తెలిసిన వారి ద్వారా కోవిడ్ ఆప్ లో మొదటి డోస్ వ్యాక్సిన్ కోసం ఏప్రిల్ 18వ తేదీన పేరు నమోదు చేసుకున్నది. ఐ.డి.30737923584300 నెంబర్ తో రిజిస్టర్ ఐనట్లు సెల్ ఫోన్ కు సంక్షిప్త సందేశం అందినది. తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏప్రిల్ 19వ తేదీన సాయంత్రం 8.02 గంటలకు  వాక్సిన్  మొదటి డోస్ బ్యాచ్ నెంబర్ : 41212054  "ఏ.మాధవి" అనే ఆరోగ్య కార్యకర్త  విజయవంతంగా  వేసినట్లు సెల్ ఫోన్ కు సంక్షిప్త సందేశం అందినది. సదరు మహిళ  అసలు తను ఆ రోజు తుర్కపల్లి  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెళ్లలేదని చెబుతున్నది. కానీ తన ఆధార్ పైన వేరే ఎవరికో మొదటి డోస్  వ్యాక్సిన్ వేసి తనకు వేసినట్లు రికార్డులలో నమోదు చేసినట్లు కనిపిస్తోంది. ఆరోపణ ఉన్నది. తిరిగి  జులై  9 వ తేదీన సెల్ ఫోన్ కు సంక్షిప్త సందేశం అందినది. సారాంశం ఏమిటంటే  వ్యాక్సిన్ రెండో డోస్ చివరి తేదీ జులై 12న ఉన్నది పేరు నమోదు చేసుకోవాలని ఆదేశం. అసలు వ్యాక్సిన్ వేయకుండానే వేసినట్లు ఇలాంటి అసత్య సమాచారం రావడంతో ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో గ్రామీణ ప్రాంత ప్రజలు వ్యాక్సిన్ వేసుకోవడానికి వెనుకాడుతున్నారు. ప్రజల ఆరోగ్యం కాపాడాలి అని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మంచి పనికి తూట్లు పడుతున్నాయి. ఇలాంటి తప్పిదాలను పై అధికారులు వెంటనే గుర్తించి ముందు ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసి ప్రజలకు వ్యాక్సిన్ పైన నమ్మకం కలిగే విధంగా పని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.