దెందుకూరులో డాక్టర్ శశిధర్ ఆధ్వర్యంలో ఆశ డే కార్యక్రమం

Published: Wednesday May 11, 2022
మధిర మే 10 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో దెందుకూరు గ్రామంలో మంగళవారం నాడు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా.శశిధర్ ఆధ్వర్యంలో నెల వారి జరిగే ఆశ డే కార్యక్రమం నిర్వహించినారు. ఇందులో పలు ఆరోగ్య సేవా కార్యక్రమంల గురించి రివ్యూ వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్బంగా డా.శశిధర్ మాట్లాడుతూ గ్రామీణ పట్టన ప్రాంతాల్లో ప్రజలకు సమగ్ర ఆరోగ్య సేవలు అందించాలి అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా.మాలతీ మేడం ఆదేశాలు మేరకు ఆరోగ్య సేవలు లక్ష్యాలు మరియు టార్గెట్ లు 100% సాదించాలి అని పారా మెడికల్ సిబ్బంది వారి వారి ప్రాంతాల్లో విధి నిర్వహణ తప్పక పాటించండి అని ప్రజలకు చిత్తశుద్ధి తో ఆరోగ్య సలహాలు సూచనలు  సేవలు అందించాలీ అని సూచించినారు. గర్భిణీ నమోదు పరీక్షలు ప్రభుత్వం హాస్పిటల్ కాన్పులు 100% జరిగించాలి అని ఇంటింటికి తిరిగి బృందం వారీగా గర్భిణీ బాలింతలను చైతన్య పరచాలి అని వివరించారు అదేవిదంగా డెంగీ మలేరియా టీబీ లేప్రసీ షుగర్ బీపీ మరియు సీజనల్ వ్యాదుల అవగాహన మరియు పని తీరు కంప్యూటరీకరణ చేయటం మొదలుగు విషయాలు వివరించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ఎన్ గోళీ రమాదేవి హెచ్ఇఒ సనప గోవింద్ హెచ్ఎస్ సుబ్బలక్ష్మి హెచ్ఎస్ లంకా కొండయ్య హెల్త్ విజిటర్ బి కౌసెల్య స్టాఫ్ నర్స్ లు రజని  సృజన ఎఎన్ఎమ్ లు జయమ్మ విజయ వై లక్ష్మి అరుణ సునీలా విజయ కుమారి విజయ లక్ష్మి నాగమణి రాజేశ్వరి హెల్త్ అసిస్టెంట్ గుర్రo శ్రీనివాస్ ఫార్మా సిస్ట్ వీనిలా ఆశ కార్యకర్తలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.