గ్రామపంచాయతీ వర్కర్ జీతాలు రాక నరకయాతన అప్పులు చేసి జీవనం గడుపుతున్న గ్రామపంచాయతీ వర్కర్ల

Published: Tuesday March 14, 2023
బోనకల్, మార్చ్ 13 ప్రజాపాలన ప్రతినిధి:
గ్రామపంచాయితీలలో పనిచేస్తున్నటున్నటి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం సరియైన సమయములో జితాలు ఇవ్వక అప్పులు చేసి జీవనము గడుపుతు నరకయాతన పడుతున్నారని గ్రామపంచాయతీ వర్కర్ మండల కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయితీలలో పనిచేస్తూ రోజువారీ వేతనముల 280 రూపాయలకు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వెట్టిచాకిరి చేయించుకుంటూ ఇచ్చే జీతాలు మూడు నెలలకు కూడా అందక అప్పులు చేసి అప్పుల బాధలు తట్టుకోలేక మనస్థాపానికి గురై చనిపోతూ ఉన్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా కొన్ని జరిగినవి. అయినా ప్రభుత్వము కుక్కలు చనిపోతే తీసిపడేసినట్లుగా గ్రామపంచాయతీ వర్కర్లపై కనికరం చూపించడం లేదని, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వహిస్తుందని వారు మండిపడ్డారు. గ్రామపంచాయతీలో వర్కర్ యొక్క సమస్యలను పట్టించుకోవడంలేదని, ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ వర్కర్లను ఒక మనిషి లెక్క చూడాలని వారు డిమాండ్ చేశారు. గ్రామపంచాయతీలో వర్కర్ల సమస్యలను ఆదుకొని పరిష్కరించే దిశగా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చనిపోయిన గ్రామపంచాయతీ వర్కర్ కొంగర్ బాబు సరైన జీతాలు అందక మనస్థాపం చెంది మరణించాడు. చనిపోయిన గ్రామపంచాయతీ వర్కర్ కొంగర బాబుకు సోమవారం బోనకల్ మండల గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ కమిటీ తరఫున తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్ మండల అధ్యక్షులు మరీదు పుల్లయ్య, కార్యదర్శి అంతోటి రమేష్, గ్రామపంచాయతీ వర్కర్స్ ఏ నాగరాజు, ఎస్కే దస్తగిరి, గద్దె వెంకటేశ్వర్లు, గుగులోతు వెంకటేశ్వర్లు, మరిదు లక్ష్మణ, తోటపల్లి శ్రీనివాసరావు, తాళ్లూరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.