మధిర యూనిట్ కార్యవర్గ సమావేశం విజయవంతం మధిర

Published: Friday December 30, 2022
డిసెంబర్ 29 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం నాడుమధిర టీఎన్జీవోఎస్ యూనిట్ కార్యవర్గ సమావేశం స్థానిక మండల ఆఫీసు నందు అధ్యక్షులు సుదర్శన్ ఆధ్వర్యంలో జరిగినదిఈ సమావేశంలో ఖమ్మం జిల్లా టిఎన్జిఎస్ అధ్యక్షులు అఫ్జల్ హాసన్, జిల్లా కార్యవర్గం సమక్షంలో నిర్వహించినారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ మధిర టీఎన్జీఎస్ ఆఫీసు కొరకు ప్రణాళికలు తయారుచేసి నూతన భవనానికి శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు మరియు ప్రతి  ఉద్యోగి సంక్షేమం కొరకు, సమస్యలు తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించబడుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో మధిర యూనిట్ కార్యదర్శి మల్లారెడ్డి అసోసియేటెడ్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు జాయింట్ సెక్రటరీ రఫీ అహ్మద్, లంకా కొండయ్య, యూనిట్ కార్యవర్గ సభ్యులు రోజా ఉషారాణి, చంద్రన్న గౌడ్, అశోక్, పాల్గొని విజయవంతం చేసినారు