ఆనందోత్సాహాల నడుమ తుమ్మల జన్మదిన వేడుకలు

Published: Tuesday November 16, 2021
మధిర నవంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర మాజీ మంత్రి జిల్లా అభివృద్ధి ప్రదాత గా నిలిచిన తుమ్మల నాగేశ్వరరావు 69 వ జన్మదిన వేడుకలు మధిర పట్టణంలో సోమవారం టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా నాయకులు మొండితోక సుధాకర్ రావు, చెరుకూరి నాగార్జున ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో తొలిగా పట్టణంలోని శ్రీ శ్రీ విఘ్నేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రయం లో కేకు కట్ చేసి పాలు పండ్లు మిఠాయిలు పంపిణీ చేశారు. తదనంతరం అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసినివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ పుటుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్, భద్రాచలం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ ఐలూరు వెంకటేశ్వర్ రెడ్డి, వేమిరెడ్డి లక్ష్మారెడ్డి తోపాటు పలువురు కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి మారుపేరుగా, నిస్వార్థ నేతగా మచ్చలేని ప్రజా ప్రతినిధిగా నాయకునిగా నిలిచారని ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధిలో తుమ్మల చేసిన కృషి అనిర్వచనీయమైనది అని పేర్కొన్నారు ఆయన సేవలు రాష్ట్రానికి అవసరమని, బంగారు తెలంగాణా నిర్మాణంలో భాగంగా  మరిన్ని అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకోనున్నదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భగవంతుడు ఆయురారోగ్యాలను ఆయన కు కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎన్నం కోటేశ్వరరావు, చుంచు విజయ్ కటికల సీతారామరెడ్డి శీలం వెంకట రెడ్డి రాయుడు భద్రయ్య మాదల రామారావు, ఎర్రగుంట రమేష్, చావలి రామరాజు, పరిశ శ్రీనివాసరావు, కోమటిడి శ్రీనివాసరావు, గద్దల చిన్ని రఘు చంటి మోదుగు బాబు లతోపాటు పలువురు నాయకులు తుమ్మల యువసేన కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు