నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి

Published: Tuesday February 08, 2022
ఆసిఫాబాద్ జిల్లా, ఫిబ్రవరి 7, ప్రజాపాలన, ప్రతినిధి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నాయని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిశెల కార్తీక్ అన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా  సోమవారం ఉద్యోగ సమస్యలపై జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిశెల కార్తీక్, జిల్లా అధ్యక్షుడు  బోర్కుటే శ్యామ్ రావులు, మాట్లాడుతూ దేశంలో అనేక ప్రభుత్వరంగ శాఖలలో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న బిజెపి ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వడం లేదని, కనీస ఉపాధి అవకాశాలు కూడా కనిపించడం లేదన్నారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోతున్న బీజేపీ ప్రభుత్వం కొంచెం ఎత్తు పోకడ పోతుందని, మొన్న విడుదల చేసిన కేంద్ర బడ్జెట్ లో కూడా నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసిందన్నారు. బిజెపి ప్రభుత్వం సం, కు 50 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న వి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని మొండిచెయ్యి చూపెడుతుందని, 1 లక్షా 91వేళ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయడంలో సోయి లేదన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా గొర్లు, బార్లు, చీరల, పేర్లతో గందరగోళం చేసే ప్రయత్నంలో ఉందనిఅన్నారు. జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1, 91 ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని, నిరుద్యోగ భృతి హామీని అమలు చేయాలని, చనిపోయిన కుటుంబాలకు రూ 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని,ఉద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు ఆత్మకూరు సతీష్, మాలాశ్రీ, టీకానంద్, తదితరులు పాల్గొన్నారు.