ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోని నీటిని తూముల ద్వారా బయటకి వదలడం ఆపాలని ఈరోజు రంగారెడ్డి జిల్

Published: Tuesday October 11, 2022

ఇబ్రహీంపట్నం అక్టోబర్ తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధిప్ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాల తర్వాత ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పూర్తిగా నుండి అలుగు పారుతున్న శుభ సందర్భంగా రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు, కానీ అధికారులు కొంతమంది వ్యక్తులు నీటిని వృధాగా బయటకి విడుదల చేశారు, పెద్ద చెరువును నమ్ముకుని సుమారు 1500  మత్స్యకారుల (ముదిరాజులు) కుటుంబాలు చెరువు పై ఆధారపడి జీవిస్తున్నారు, నీటిని విడుదల చేయకుండా ఆపాలని కోరుతున్నాను, అలాగే చిన్న చెరువులో గతంలో అభ్యంతరాలు వ్యక్తం చేసిన మున్సిపల్ అధికారులు పార్కు కొరకై సుమారుగా 50 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేశారు వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
, అదేవిధంగా వర్షాల వలన పంటలు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాండురంగారెడ్డి, ఆదిభట్ల మాజీ సర్పంచ్ భూపతి గళ్ళ రాజు, నాయకులు సతీష్ గౌడ్, నవీన్ రెడ్డి,కావలి బగ్గరములు, సుధాకర్ రెడ్డి , రైతులు, మత్స్యకారులు  తదితరులు పాల్గొన్నారు.