అన్నారుగూడెం విద్యార్థినికి ఓయూ డాక్టరేట్

Published: Monday March 13, 2023
తల్లాడ మార్చి 12 (ప్రజా పాలన న్యూస్):
యలగందుల కనకదుర్గ 1998లో అన్నారుగూడెం ప్రభుత్వ పాఠశాల లో 10వ తరగతి చదివి  ఇంటర్మీడియట్ తల్లాడ సూర్య కళాశాలలో అభ్యసించి  ఖమ్మం డిగ్రీ ఉమెన్స్ కళాశాలలో బిఏ తెలుగు పూర్తి చేసి హైదరాబాద్ కోటి ఉమెన్స్ కళాశాలలో ఎంఏ తెలుగు ఉత్తీర్ణత సాధించి ఉస్మానియా యూనివర్సిటీలో డాక్టరేట్ పట్టా పొందారు.
అన్నారు గూడెం గ్రామ నివాసి అయిన యలగందుల రంగాచార్య గోవిందమ్మల కుమార్తె కనకదుర్గకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది విశ్వబ్రాహ్మణ కుల వృత్తులైన పంచాననం  కుల విజ్ఞానం ఒక పరిశీలనం అనే అంశంపై ఓయూ తెలుగు శాఖ ప్రొఫెసర్ వారిజా రాణి  పర్యవేక్షణలో చేసిన పరిశోధనకుగాను ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రధానం చేసింది ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆచార్యులు తెలుగు శాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ సికాసిం పాఠ్యప్రణాళిక సంఘం అధ్యక్షులు ప్రొఫెసర్ సాగి కమలాకర శర్మ తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ప్రొఫెసర్ సూర్య ధనుంజయ ప్రొఫెసర్ ఎస్ రఘు , ప్రొఫెసర్ విజయలక్ష్మి, ప్రొఫెసర్ వారిజా రాణి కనకదుర్గ ను అభినందించారు..తల్లిదండ్రులుసోదరసోదరులు ,బంధుమిత్రులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.అన్నారుగూడెం గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.