పవర్ ప్లాంట్ పి.పి.ఏ పెంపు కోసం కౌన్సిల్ తీర్మానం చేయాలి*

Published: Wednesday January 25, 2023

మంచిర్యాల టౌన్, జనవరి 24, ప్రజాపాలన: పవర్ ప్లాంట్ పి.పి.ఏ పెంపు కోసం కౌన్సిల్ తీర్మానం    చేసి కార్మికులను ఆదుకోవాలని, పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పి.పి.ఏ) పొడిగించాలని శాలివాహన పవర్ ప్లాంట్ కార్మికులు మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్యకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పెంట రాజయ్య  సానుకూలంగా స్పందించి స్థానిక శాసన సభ్యుల, కౌన్సిల్ సభ్యుల  సహకారముతో కౌన్సిల్ తీర్మానం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కార్మికులకు న్యాయం చేస్తామని తెలిపారు. అనంతరం కార్మిక సంఘము అధ్యక్షులు కుంటాల శంకర్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శాలివాహన  6 మెగా వాట్స్ బయోమాస్ పవర్ ప్లాంట్ నిర్మించి ప్రభుత్వంతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్(పి.పి.ఏ)20 సంవత్సరాల పాటు చేసుకున్నారు,ఈయొక్క అగ్రిమెంట్ 2022 డిసెంబర్ నెల 6వ తేదీతో ముగిసింది, ఈయొక్క కంపెనీలో సుమారుగా 200 మంది కార్మికులు కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు, మధ్యంతరంగా కంపెనీ మూసి వేస్తే కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని అన్నారు. పవర్ ప్లాంట్ నకు మరో పది సంవత్సరాల పాటు పి.పి.ఏ.పొడిగించే విధంగా మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు బొలిశెట్టి సునీత కిషన్,ఆపీజబేగం,చైతన్య సత్యపాల్ రెడ్డి,వంగపెళ్లి అనిత,మెరుగు మహేశ్వరి గార్లు, కార్మిక సంఘము అధ్యక్షులు కుంటాల శంకర్,జనరల్ సెక్రేటరీ ఎన్.సత్యనారాయణ,ఉపాధ్యక్షులు సగ్గుర్తి ఆనందరావు,కాయితి శ్రీనివాస్,అసరి రాజయ్య, ఇసారపు శంకర్, తదితరులు పాల్గొన్నారు.