ఘనంగా కార్తీక పౌర్ణమి వ్రత పూజలు.

Published: Tuesday November 08, 2022
తల్లాడ, నవంబర్ 7 (ప్రజాపాలన న్యూస్):
కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని సోమవారం రోజు మండల పరిధిలోని కేశవాపురం గ్రామంలో సర్పంచ్ వనిగండ్ల అలేఖ్య అశోక్ ఆధ్వర్యంలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో గ్రామ ప్రజలు సామూహిక కార్తీక పౌర్ణమి వ్రతాలు నిర్వహించారు.  పవిత్రమైన రోజైన కార్తీక పౌర్ణమి రోజు పురస్కరించుకొని గ్రామంలోని పలు కుటుంబాలు సీతరామ ఆలయంలో అత్యంత భక్తిశ్రద్ధలతో సామూహికంగా వ్రతాలు చేసుకున్నారు. అయ్యప్ప మాల దరించుకున్న స్వాములు భజన కార్యక్రమాలు నిర్వహించారు. .కార్యక్రమంలో గ్రామ పెద్దలు చావ నరసింహారావు, వనిగండ్ల వెంకటేశ్వరరావు, అలయకమిటీ అధ్యక్షుడు కట్టా శ్రీనివాసరావు, కృష్ణ రావిలాల వెంకటేశ్వరరావు, సూర్యదేవర వెంకటేశ్వరరావు, దేవరపల్లి వెంకటేశ్వరరావు,చావా తిరుమల రావు,శ్రీను,నరసింహారావు పాల్గొన్నారు.