ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Published: Saturday July 23, 2022
జిల్లా రెవెన్యూ అధికారిణి విజయ కుమారి
వికారాబాద్ బ్యూరో 22 జూలై ప్రజా పాలన :  జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను పక్కడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవిన్యూ అధికారిణి విజయకుమారి సంబంధిత అధికారులకు సూచించారు.
శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో పరీక్షల ఏర్పాటుపై సమన్వయ సమావేశం నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఆగష్టు,1 నుండి 10 వరకు ఉదయం 9:00 గంటల నుండి 12:00 వరకు, మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు రెండు సెషన్ లలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.  ఒక్క నిమిషము ఆలస్యమైన పరీక్షకు అనుమతించబడదన్నారు.  జిల్లాలో 18 పరిక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరిక్షా సమయంలో పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.  పరిక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్ లు మూసివేయాలన్నారు.  ప్రతి పరిక్షా కేంద్రంలో వద్ద వైద్య శాఖ ద్వారా ఏయన్ఎమ్ లను ఏర్పాటు చేసి అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలన్నారు.  శానిటేషన్, ఫాగింగ్ చేయించాలని సూచించారు.  పోలీస్ శాఖ ద్వారా ఎస్కార్ట్ ఏర్పాటు చేసి ప్రశ్న పత్రాలు సురక్షితంగా పరిక్షా కేంద్రానికి తరలించాలని అన్నారు.  పరిక్షలు పూర్తి అయ్యే వరకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని,  విద్యార్థులు సకాలంలో పరిక్షా కేంద్రానికి చేరుకొనేలా ఉదయం సాయంత్రం బస్సులను సకాలంలో నడపాలన్నారు.  అన్ని శాఖల సహకారంతో పరీక్షలు విజయవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శంకర్ నాయక్, జిల్లా ఇంటర్ పరీక్షల కమిటీ సభ్యులు రాజ్ మోహన్, బుచ్చయ్యలతో పాటు రెవిన్యూ, పోలీస్, మెడికల్, ఎలక్ట్రిసిటీ, ఆర్ టి సి, పోస్టల్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area