యాకూబ్ పాషా ఆధ్వర్యంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు.

Published: Monday July 25, 2022
తల్లాడ, జులై 25 (ప్రజాపాలన న్యూస్):
 *తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన వేడుకలను ఆదివారం చిన్నారుల మధ్య ఘనంగా నిర్వహించారు. టిఆర్ఎస్ పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు షేక్. యాకుబ్ పాషా, మైమూద్ పాషా ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చిన్నారులు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. కేటీఆర్ పిలుపుమేరకు అన్నారుగూడెం బస్టాండ్ లో ఉన్న యాచకులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం టిఆర్ఎస్ పార్టీ నాయకులు పొన్నం కృష్ణయ్య మాట్లాడుతూ చిన్నారుల మధ్య కేటీఆర్ జన్మదిన వేడుకలను జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పిన్ని శీను, గోవిందు సురేష్, పులి శ్రీను తదితరులు పాల్గొన్నారు.*