కరీంనగర్ ను హరిత వనంగా తీర్చిదిద్దుతామని అందరం ప్రతిన బూనుదాము

Published: Saturday June 04, 2022
చెట్లను ఆస్తిగా భావించుకొని మొక్కలు నాటుదాం
 
పల్లెలు పట్టణాలు అభివృద్ధి కి నేరుగా వేల కోట్ల రూపాయలు
 
రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్
 
కరీంనగర్ ,జూన్ 3 ప్రజాప్రాలన ప్రతినిధి :
పట్టణమును హరిత వనంగా తీర్చిదిద్దుతామని అందరం ప్రతిన బూనాలని రాష్ట్ర బీసీ సంక్షేమం శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు.
 
 కరీంనగర్ పట్టణంలోని 22 డివిజన్ సుభాష్ నగర్ లో శుక్రవారం నిర్వహించిన 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ ను హరిత వనంగా తీర్చిదిద్దేందుకు, వాతావరణ సమతుల్యత కొరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు చెట్టు నాటి సంరక్షణ చేయాలన్నారు. హరిత హారంలో విరివిగా మొక్కలు నాటాలి అన్నారు. గతంలో గ్రామాల్లో, పట్టణాల్లో అపరిశుభ్రమైన వాతావరణంతో ప్రజలు అనారోగ్యా సమస్యలు ఎదుర్కొనే వారని, ప్రజల జీవన శైలి, పల్లెల్లో పట్టణాల్లో అందమైన వాతావరణం కల్పించి పల్లెలను పట్టణాలుగా తీర్చిదిద్దిలని,పట్టణాలను ఆధునికరించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందన్నారు. గతంలో నీళ్లకోసం బిందెలు పట్టుకొని ట్యాంకర్ల వద్దకు ప్రజలు  పోయే వారన్నారు, మురికినీటి కాలువల మీరు రోడ్లపై వచ్చేదని కలుషితమైన నీటితో ప్రజలు అనారోగ్యం బారిన పడే వారన్నారు. పల్లెలు పట్టణాలు అభివృద్ధి కి ప్రభుత్వం నేరుగా వేల కోట్ల రూపాయలు అందిస్తుందని తెలిపారు.రాష్ట్రం కోసం అనేక పోరాటాలు చేసి సాధించుకున్నామని,మన కొసం కాకున్నా మన పిల్లల భవిష్యత్ మారాలని సంపద పెరగాలని సాధించుకున్నామని తెలిపారు.రాష్ట్రం రాకముందు మన పరిస్థితి ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉండే ఆలోచించుకోవాలన్నారు.
ప్రజల భాగస్వామ్యం కావాలి అని సీఎం కేసీఆర్ తీసుకున్నదే ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం అన్నారు.ప్రజల సహకారం తో అందరూ కలిసి అభివృద్ధి చేసుకోవాలనే లక్ష్యం అని తెలిపారు.తెలంగాణ వచ్చాక 40 ఏళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపించామని మన పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ప్రథమ కర్తవ్యంగా తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని ప్రభుత్వానికి సహకరించాలి..మన ఆరోగ్యం బాధ్యత మనమే తీసుకోవాలి,
రాబోయే రోజుల్లో 24 గంటలు నీళ్లు ఇచ్చే కార్యక్రమం చేపట్టనున్నామని అన్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం కోసం అనేక పార్కులు ఏర్పాటు చేసాం,మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మెడికల్ కళాశాల, ఐటీ టవర్ ఏర్పాటు చేసాం,తెలంగాణ లో అత్యుత్తమ మైన నగరంగా కరీంనగర్ అనే పేరు రావాలి..అందుకే మనకు అనేక అవార్డులు వస్తున్నాయి.నగరాన్ని సుందరంగా ఉంచేందుకు అందరూ బాధ్యత తీసుకోవాలి.
చెట్లను ఆస్తిగా బావించుకొని మొక్కలు నాటుదాం..రానున్న వానాకాలం లో నగరాన్ని కాంక్రీట్ జంగిల్ నుండి హరిత వణంగా తీర్చిదిద్దుతామని అందరం ప్రతిన భూనుదాము.
 
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై.సునీల్ రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సేవా ఇస్లావత్,పిడి మెప్మా రవీందర్, డి ఈ ఓ జనార్దన్ రావు, డివిజన్ కార్పొరేటర్ గంట కళ్యాణి, కుర్ర తిరుపతి  తదితరులు పాల్గొన్నారు.