నాటిన ప్రతి మొక్క సంరకించుకోవాలి: జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి

Published: Thursday February 18, 2021

గ్రీన్ చాలెంజ్ లో భాగంగా జిల్లా లో 2 వేల మొక్కలు నాటిన అధికారులు
మంచిర్యాల జిల్లా ప్రతినిధి,. పిబ్రవరి17, ప్రజాపాలన: హరితహారం, గ్రీన్ చాలెంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా బుధవారం గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మంచిర్యాల మున్సిపాలిటీలో 2 వేల మొక్కలను నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా కేంద్రంలోని శ్రీనిధి లేదాట్ లో 1500ల పండ్ల మొక్కలను నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించి, ఎమ్మెల్యే. జిల్లా కలెక్టర్. అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మున్సిపల్ కౌన్సిలర్, వార్డు కౌన్సిలర్ల పేర్ల మీద ఒక్కొక్క పండ్ల మొక్కను ప్రత్యేకంగా నాటారు. ఆనంతరం పండ్ల మొక్కల వనంలోనే సీఎం కేసీఆర్ జన్మదినంను పురస్కరించుకుని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. వంద ఫీట్ల బైపాస్ రోడ్డులో 250 మొక్కలు, రాజీవ్ నగర్లోని వంద ఫీట్ల రోడ్డులో 250 మొక్కలను ఈ సందర్భంగా నాటారు. శ్రీనిధి లేఔట్ లో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం రాశివనంను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాలి, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వార్డు కౌన్సిలర్ బొలిశెట్టి సునిత పాల్గొన్నారు.