సహాయం అభినందనియo meo ప్రభాకర్

Published: Friday June 11, 2021
మధిర, జూన్ 10, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీ ఈరోజు మధిర ఆజాద్ రోడ్ లో ప్రముఖ సామజిక సేవకుడు లంకా కొండయ్య నివాస ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కరోనా బాధితుల సహాయంలో బాగంగా నిరుపేద కుటుంభం ఐన శిల్ప ఆరోగ్యం సరిగా లేక గతంలో కోవిడ్ కి గురై ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స పొంది ఇంటి వద్ద కొంత అనారోగ్యoతో బాధ పడుతున్న కుటుంబానికి మానవ సేవే మాధవ సేవగా భావించి మధిర పట్టణానికి చెందిన ప్రముఖ ఉపాధ్యాయులు, ఉచిత హోమియో హాస్పిటల్ సేవకులు శ్రీ మేడేపల్లి శ్రీనివాసరావు కుమార్తె కుమారి మేడేపల్లి ప్రణీత  తాను ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5 నుంచి 8సందర్బంగా Team extra mile foundation నల్గొండ నాగమోహన్వారిచే online లో నిర్వహించబడిన గ్రీన్ స్టార్ ఛాలెంజ్ కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 250 మంది  పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమంలో టాప్ 10లో సెలెక్ట్ ఐన ప్రణీత కి 1000 క్యాష్ ప్రైజ్ బహుమతి సాధించడం జరిగింది. ఈ నగదును మానవతా దృక్పధంతో సెకండ్ వేవ్ లాక్ డౌన్ లో బాధ పడుతున్న నిరుపేద కుటుంబానికి చిట్టి చేతులు పెద్ద మనసుతో నిత్యావసర సరుకులు MEO ప్రభాకర్ చేతుల మీదగా అందించారు. అదే విధంగా మరొక నిరుపేద కుటుంబానికి మేడేపల్లి శ్రీనివాసరావు గారి అత్తయ్య శ్రీమతి పసుమర్తి శివపార్వతి గారి జ్ఞాపకర్థంగా వేయి రూపాయల సరుకులు లంక కొండయ్య చేతుల మీదు గా అందించారు. అదేవిధంగా ఆ కుటుంబానికి సరిపడా వస్త్రాలు శ్రీనివాసరావు కుటుంబం అందించారు. ఈ సందర్బంగా MEO ప్రభాకర్ గారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు దోహద పడే మొక్కల నాటి రాష్ట్ర స్థాయి పోటీలో నగదు బహుమతి సాధించిన ప్రణీత పేదవారికీ సహాయం చేయటం అభినందనియం అని, చిన్న పిల్లలో సృజనత్మాకతను వెలికితీసి ఫౌండేషన్ ఏర్పాటు చేసి పర్యావరణానికి ప్రాముఖ్యత ఇస్తున్న నాగమోహన్ గారికి మధిర విద్యాశాఖ తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ లొక్డౌన్ లో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసి కడు పేదలకు ఆధరణ కల్పిస్తున్న లంకా కొండయ్య బృందాన్ని వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో లంక సేవా ఫౌండేషన్ వాలంటీర్ లంక కరుణ లియోనా, అధిములం వెంకటేష్, రేమల్లి ప్రశాంత్, సన్నీ, సాయి, గోపి, అంజి పాల్గొన్నారు.