ఉప్పరిగూడలో రూ. 1.96 కోట్ల అభివృద్ది పనులకు శ్రీకారం మరింత అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానన

Published: Tuesday August 02, 2022

రాష్ట్రంలోని అన్ని గ్రామాల సమగ్రాభివృద్ధికి తెరాస ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామంలో రూ. 1.96 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులను సోమవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు.  అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన సభలో ప్రసంగించారు. వచ్చే దసరా పండుగలోగా అర్హులైన ప్రతి ఒక్కరికి కొత్త పింఛన్లు మంజూరు చేస్తామని అదేవిధంగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులను జారీ చేస్తామని చెప్పారు. అర్హులైన ప్రతిఒక్కరికీ తిరిగి రేషన్ కార్డులు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు దరిచేరే విధంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. ఉప్పరిగూడ గ్రామాభివృద్ధికి ఇప్పటికే దాదాపు రూ. 3 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. రూ.5 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణం చేపతున్నట్లు తెలిపారు. గ్రామంలో పాఠశాల భవనం పూర్తి శిధిలావస్థకు చేరిందని నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. ప్రస్తుతం మరో రెండు కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు వివరించారు. గ్రామ సర్పంచ్ పాలకవర్గం కోరిక మేరకు ప్రజల సౌకర్యార్థం పెండింగ్లో ఉన్న రోడ్ల సమస్యను త్వరతగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా బిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బూడిద నందారెడ్డి, గ్రామ సర్పంచ్ బూడిద రాంరెడ్డిలు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఘనంగా సన్మానించి పూల బోకే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి కృపెష్, జెడ్పీటీసీ మహిపాల్, వైస్ ఎంపిపి ప్రతాప్ రెడ్డి, ఇబ్రహీంపట్నం వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి,  సొసైటీ చైర్మన్ సుదర్శన్ రెడ్డి, బిఎన్ఆర్ ట్రస్ట్ చైర్మన్ బూడిద నందారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు వంగేటి లక్ష్మారెడ్డి, తెరాస నాయకులు బుగ్గ రాములు, భాస్కర్ రెడ్డి, జెర్కొని రాజు, రాజేష్,  వార్డు సభ్యులు మహేందర్, గ్రామ సెక్రెటరీ రిషికనేత, అధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.