ఆళ్లపాడు లో ప్రభుత్వ డాక్టర్లచే హేల్తుక్యాంపు

Published: Friday October 28, 2022
 బోనకల్, అక్టోబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం జరిగిన హెల్త్ క్యాంపు ప్రభుత్వ డాక్టర్లచే నిర్వహించడం జరిగింది.గ్రామములో అనారోగ్యంతో ఉన్నటువంటి గ్రామస్తులు గర్భిణీలు బాలింత లకు వైద్య పరీక్షలు నిర్వహించి తగిన మందులు పంపిణీ చేశారు. గ్రామంలో 100 మందికి రక్త నమోనాలు సేకరించి వారి యొక్క డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ ఇతారాత్ర వైద్య పరీక్షల కోసం రక్త నమోనాలు సేకరించి వంద మందికి రక్త నమూనాలను తీసుకుని వారికి తగినటువంటి మందులను పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, ప్రభుత్వ డాక్టర్ గోపి, హెల్త్ సూపర్వైజర్ దానయ్య, ఏఎన్ఎం తిరుపతమ్మ ,ఆశా కార్యకర్తలు, హెల్త్ క్యాంపు సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.