నేడు జిల్లాకు రాష్ట్ర మంత్రి వర్యుల రాక

Published: Wednesday June 15, 2022
మంచిర్యాల బ్యూరో, జూన్ 14, ప్రజాపాలన:
 
జిల్లాలో ఈ నెల 15వ తేదీన రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసన వ్యవహారాలు, హౌసింగ్ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యటించనున్నట్లు పి.ఎ. టు మినిస్టర్ మంగళవారం  ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 9 గం॥లకు మందమర్రి మండలం క్యాతన్పల్లి పట్టణంలోని ప్రభుత్వ విప్, చెన్నూర్ శాసనసభ్యులు బాల్క సుమన్ నివాసానికి చేరుకొని అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపారు. ఉదయం 10 గం॥లకు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవన నిర్మాణ పనులను పరిశీలించి, 10.45 గం॥లకు భీమారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన టి.ఆర్.ఎన్. పార్టీ మండల కార్యాలయం, 10.50 గం॥లకు ఈ-రైతు వ్యవసాయ అవసరాల షాప్, 11 గం॥లకు చెన్నూర్ మండలం కిష్టంపేట వద్ద 3 కోట్ల 50 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 12 గం॥లకు 10 కోట్ల రూపాయల నిధులతో సుద్దాల వాగుపై నూతనంగా నిర్మించ తలపెట్టిన వంతెన పనులకు శంఖుస్థాపన చేస్తారని, 1 గం॥లకు చెన్నూర్ మండలంలో 1 కోట్ల 97 లక్షల రూపాయలలో నూతనంగా నిర్మించిన గంగారం వంతెన, 2 గం॥లకు 4 కోట్ల 80 లక్షల రూపాయలతో నిర్మించిన సుబ్బరాంపల్లి వంతెన, సాయంత్రం 4 గం||లకు కోటపల్లి మండలం బంధం గ్రామం వద్ద తుంతుంగ వాగుపై 8 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభిస్తారని తెలిపారు. సాయంత్రం 6 గం॥లకు కోటపల్లి నుండి బయలుదేరుతారని తెలిపారు.