తెలంగాణ కాంగ్రెస్ నిరసన ర్యాలీకి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ

Published: Friday July 22, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 21 ప్రజాపాలన ప్రతినిధిఏఐసీసీ అధ్యక్షురాలు, తెలంగాణ తల్లి సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ గార్లపై ఈడి అక్రమ నోటీసులకు నిరసనగా ఈరోజు  హైదరాబాద్, నెక్లెస్ రోడ్డు, ఇందిరా గాంధీ విగ్రహం వద్ద నుండి బషీర్ బాగ్, ఈడి కార్యాలయం వరకు తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన ర్యాలీ మరియు ఈడి కార్యాలయం ముందు నిరసన దీక్షకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుండి టీపీసీసీ కార్యదర్శి దండెం రాంరెడ్డి  ఆధ్వర్యంలో భారీ ఎత్తున 1000 మందికి పైగా కాంగ్రెస్ శ్రేణులతో వెళ్లి ర్యాలీలో పాల్గొని నిరసనను తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా దండెం రాంరెడ్డి  మాట్లాడుతూ... సోనియా గాంధీ  దేశంకోసం తమ అత్తగారిని, భర్తను కోల్పోయారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎప్పుడు ఆవిడ ప్రధాన మంత్రి పీఠం ఎక్కలి అనుకోలేదని, దేశం కోసం దేశ ప్రజల శ్రేయస్సు కోసం మరియు పార్టీ కోసం మాత్రమే ఆవిడ ఆలోచించారని ఆయన గుర్తుచేశారు, పదవి పై, డబ్బు పై ఎటువంటి వ్యామోహం లేని ఒక మహా నాయకురాలి మీద కావాలని వారిని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఎటువంటి ఆధారాలు లేకుండా, గతంలో మూసివేసిన నేషనల్ హెరాల్డ్ ఇష్యును మోదీ ప్రభుత్వం తీరగదొడి, అక్రమంగా ఈడి నోటీసులు పంపడం సిగ్గుచేటు అన్నారు, నేషనల్ హెరాల్డ్ ఇష్యూ అనేది డబ్బు లావాదేవీలు లేకుండా ఒక సాధారణ రుణం-ఈక్విటీ మార్పిడి అని ఆయన వివరించారు, లావాదేవీలో డబ్బు ప్రమేయం లేనందున, మనీ లాండరింగ్ అనే ప్రశ్న తలెత్తదని, గాంధీ కుటుంబాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు, కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే మోదీ ప్రభుత్వం ఇలాంటి సిగ్గుమాలిన పనులు చేస్తుందని ఘాటుగా వ్యాఖ్యానించారు, మోదీ ఇప్పటికీ అయిన తన తప్పును తెలుసుకొని, ఇలాంటి సిగ్గుమాలిన పనులు మానుకోవాలని, గాంధీ కుటుంబానికి క్షమాపణ చెప్పాలని దండెం రాంరెడ్డి  డిమాండ్ చేశారు.